Begin typing your search above and press return to search.

ఏపీలో మద్యం ధరలు పెంచడానికి కారణం ఇదే : సీఎం జగన్!

By:  Tupaki Desk   |   5 May 2020 9:30 AM GMT
ఏపీలో మద్యం ధరలు పెంచడానికి కారణం ఇదే : సీఎం జగన్!
X
లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు ప్రారంభమైయ్యాయి . ఏపీలో కూడా సోమవారం మద్యం అమ్మకాలు ప్రారంభించారు. అయితే , మొదటి రోజు గతం కంటే మద్యం ధర 25 శాతం పెంచిన ప్రభుత్వం ..రెండో రోజు మరో 50 శాతం ధరను పెంచింది. అయినప్పటికీ మందుబాబులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగేలా చూస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనితో ధరల పెంపు పై సీఎం జగన్ స్పందించారు.

మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లండిచారు. ఇదే సమయంలో అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

లిక్కర్ ‌కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎలా జరుగుతుందో అన్న విషయాన్నిన్ని టీవీఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలి. మనం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నాం. మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 20 శాతం తగ్గించాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం తగ్గించినట్టు అవుతుంది. ప్రతి షాపు వద్ద ఇంతకుముందు ప్రైవేటు రూమ్స్‌ పెట్టారు. మనం దీన్ని రద్దుచేశాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం అని సీఎం జగన్ తెలిపారు

మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేశాం అని , అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం అని, షాక్‌ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం అని అయన తెలిపారు. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, అలాగే రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. దీనికోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాంఅని , లిక్కర్ - ఇసుక మీద కలెక్టర్లు - ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్‌ సిబ్బంది మాత్రమే పూర్తిగా నియంత్రించలేరు అని , మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలని వైఎస్‌ జగన్‌ అన్నారు.