Begin typing your search above and press return to search.

మద్యంతో ఏపీకి రూ. 30 వేల కోట్లు వస్తాయని అంచనా ..!

By:  Tupaki Desk   |   7 May 2020 6:30 AM GMT
మద్యంతో ఏపీకి రూ. 30 వేల కోట్లు వస్తాయని అంచనా ..!
X
కరోనా మహమ్మారిలా కారణంగా.. గత నలభై రోజులుగా దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లాక్ డౌన్ నుండి కేంద్రం కొన్నింటికి సడలింపు ఇవ్వడంతో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. కేంద్రం ఇచ్చిన సడలింపులు తోనే.. ఏపీలో కూడా మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. అయితే ఏపీ లో మద్యం ధరలు 75 శాతం పెంచడం వల్ల.. ప్రభుత్వానికి సుమారుగా 30 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేశారు.

గతేడాది కంటే అదనంగా 13 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచిన నేపథ్యంలో గత ఏడాది పరిమాణంలోనే మద్యం ఆమ్ముడైతే దాని విలువ దాదాపు 36,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తంపై సుమారు 84 శాతం వరకు వివిధ రకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈ లెక్కన 30 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

అయితే తాజాగా మద్యం ధరలు 75% పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మద్యం పరిమాణం కొంత తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు...అయితే ఏపీలో రెండు రోజుల నుంచి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లిక్కర్ షాపులను 33శాతం మేర తగ్గింది. రాష్ట్రంలో వాస్తవానికి 4380 లిక్కర్ షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని 3500కు గతంలోనే తగ్గించారు. ఇప్పుడు వాటిని 2934కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చేదిశగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మద్యం దుకాణాలను తగ్గించినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటన జారీ చేసింది.