Begin typing your search above and press return to search.
ఆగస్టులో స్కూళ్లు ఓపెన్ అన్న జగన్ మాటకు అసలు అర్థం ఇదేనట
By: Tupaki Desk | 8 July 2021 3:30 AM GMTపాలకులు తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి మైలేజీ పెంచితే.. మరికొన్ని అనూహ్యమైన డ్యామేజ్ జరిగేలా చేస్తాయి. ముందుచూపు లేని అధికారులు ఇచ్చే నివేదికలు కూడా ప్రభుత్వాల్ని తప్పుదారి పట్టించేలా చేస్తాయి. తాజాగా ఏపీకి సంబంధించిన ఇష్యూలో ఇలాంటి పరిస్థితే నెలకొందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే.. తాజా ప్రకటన వెనుక ప్రభుత్వ వ్యూహం దాగి ఉందన్న మాట వినిపిస్తోంది.కరోనా నేపథ్యంలో స్కూళ్ల విషయంలోనూ.. విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టింది. అయితే.. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకొని.. అది చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరీక్షల్ని నిర్వహించకూడదని డిసైడ్ చేశారు.
నిజానికి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మంచిదే. కానీ.. కరోనాలాంటి ప్రత్యేక సందర్భాల్లో పిల్లల భవిత కంటే కూడా వారి ఆరోగ్యం చాలా కీలకమని చెప్పాలి. ఇదే.. పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. స్కూళ్లకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది జగన్ సర్కారు. ఆగస్టు 15 తర్వాత రాష్ట్రంలోని స్కూళ్లను తెరవాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టం చేశారు.
అదే సమయంలో.. ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేసుకునే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాదు.. ఆగస్టులో విద్యాకానుకతో పాటు.. నాడు - నేడు కింద పనులు కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నాణ్యమైన విద్యకు నైపుణ్యం ఉన్న టీచర్ల బోధనకే పెద్దపీట వేసేలా నూత విద్యా విధానమని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన అంశాల్ని సమావేశంలో చర్చించారు.
కొత్త విధానంలో ఒక్క స్కూల్ కూడా మూసేయకూడని.. ఒక్క టీచర్ ను కూడా తొలగించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఆయన మాటలు ఏపీ విద్యా రంగంపై కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయని చెప్పాలి. సబ్జెక్టు మీద పట్టున్న ఉపాధ్యాయుల సేవల్ని సమర్థంగా వినియోగించుకునేలా ప్లాన్ చేయాలని కోరారు. నూతన విద్యా విధానంలో కొత్తగా నిర్మించే తరగతి గదుల విషయంలో ఎలాంటి లోటు ఉండకుండా చూసుకోవలన్నారు. ముందుగా అనుకున్నట్లు కనీసం 21వేలకు పైగా కొత్త తరగతి గదుల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా జరగాలన్న సీఎం జగన్.. అందుకు అవసరమైన ఖర్చుకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని కోరారు.
ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఆగస్టులో విద్యాకానుక అందించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు ఇవ్వాలని భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ టు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యాకానుకలో భాగంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, నోట్‌బుక్స్, షూ, బెల్టు అన్నీ సిద్ధం అయ్యాయా? లేదా? అన్నది సమీక్షించుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదంతా బాగానే ఉన్నా.. ఆగస్టు మూడో వారంలో కరోనా థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళలో స్కూళ్లను తెరిచే అంశాన్ని ప్రకటించకుండా ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పక్షంలో ప్రభుత్వం అనుకున్నట్లుగా స్కూళ్లు తెరిచే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఆగస్టులో స్కూళ్లు తెరవాలన్నట్లుగా సీఎం జగన్ ఎందుకు వ్యాఖ్యానించారన్న దానిపై మరో వాదన వినిపిస్తోంది.
స్కూళ్లు తెరిచినంతనే సాధారణంగా పలు సమస్యలు తెర మీదకు వస్తుంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. అధికారులకు లక్ష్యాన్ని ఇచ్చేయటం.. ఫలానా సమయం లోపు మీరీ పనులన్ని చేయాలని ఆదేశించటమే అసలు ఉద్దేశమని చెబుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక విమర్శలు చేస్తున్నారే తప్పించి మరింకేమీ లేదంటున్నారు.