Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి చెక్ .. హైకోర్టు కీలక ఉత్తర్వులు , ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు !

By:  Tupaki Desk   |   31 May 2021 7:30 AM GMT
ఏపీలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి చెక్ .. హైకోర్టు కీలక ఉత్తర్వులు , ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు !
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ సమయంలో కూడా కాసుల కోసం కక్కుర్తి పడుతూ , వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా కొన్ని ఆస్పత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం , సామాన్యులు ఎంతగా విన్నపం చేస్తున్నా కూడా ఏ మాత్రం మానవత్వం అనేది లేకుండా ఆస్పత్రి వర్గాలు ఫీజులు దండుకుంటున్నాయి. ఈ తరహా ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ విష‌యంపై అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై ఏపీ హైకోర్టు ఆదేశాలు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్దారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాల‌ని హైకోర్టు సూచించింది.

కరోనా రోగులకు బిల్లులు ఇచ్చే ముందుగా నోడల్ ఆఫీసర్ సంతకం చేయాలని న్యాయ‌స్థానం ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా పరిశీలించాలని తెలిపింది. అలాగే నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు నగదు తీసుకోకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స న‌గ‌దుకు సంబంధించి డిస్ ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలు అమలు జరిగిలా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ ఓ లను హైకోర్టు ఆదేశించింది.ఏపీ హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై విచారణలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. దీనిపై ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్ధారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. అయితే రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు తెలపగా , ప్రభుత్వ ఆదేశాల్లో కూడా ఇదే స్పష్టం చేసింది.