Begin typing your search above and press return to search.
ఉద్యోగుల హాజరుపై ఏపీ సర్కారు నజర్
By: Tupaki Desk | 5 Nov 2021 9:17 AM GMTఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులే కళ్లు, చెవులు. సర్కారుకు మంచి మార్కులు రావాలన్నా, మైనస్ మార్కులు వచ్చాయన్నా ఉద్యోగుల పనితీరే నిదర్శనం. అందుకే ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాలకు బాగా ప్రాధాన్యం ఇస్తుంటాయి. గవర్నమెంటు నడిచేందుకు కీలకమైన రాబడి రావాలంటే ఉద్యోగులు ఎంత కీలకమో చెప్పాల్సిన పనిలేదు.
అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఉద్యోగుల పనితీరును కూడా ఎవరూ పెద్దగా పట్టించుకున్నది లేదు. ప్రైవేటు రంగంలోనూ ఇదే తీరు నెలకొంది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనడం, టీకా పంపిణీ కూడా వేగిరం కావడంతో ప్రభుత్వాలు మళ్లీ ఉద్యోగుల నుంచి మంచి పనితీరును ఆశిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల సచివాలయంలో ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును ఏపీ సర్కారు తప్పనిసరి చేసింది. దీనిపై సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల హాజరు వివరాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని సచివాలయంలోని ఆయా విభాగాల కార్యదర్శులకు స్పష్టం చేసింది.
బయోమెట్రిక్ ద్వారా నమోదైన ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది. ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు రోజువారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాల్సి ఉంటుంది. సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించింది. కాగా ఏపీ సచివాలయంలో పదిశాతం మంది ఉద్యోగులు ఉదయం పదకొండు గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్టు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగస్తుండడమే కారణం. ఇక ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని పేర్కొంది. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని వివరించింది.
బయోమెట్రిక్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం
తమ ఉద్యోగులకు కరోనా కారణంగా ఇన్నాళ్లూ నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించింది. ఈ నెల 8 నుంచి ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరు వేయాలని కోరింది. ఈ సందర్భంగానూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. శాఖల అధిపతులు ఇందుకు బాధ్యత తీసుకోవాలని పేర్కొంది.