Begin typing your search above and press return to search.
కత్తి మహేష్ మృతిపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
By: Tupaki Desk | 15 July 2021 4:33 AM GMTప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద క్రిష్ణ మాదిగతోపాటు కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ ఫిర్యాదుల మేరకు ‘కత్తి మహేష్’ మృతిపై విచారణ జరపటానికి సిద్ధమైంది. ఈ మేరెు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సంచలన ప్రకటన చేశారు.
కత్తి మహేష్ దళిత జాతిలో ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అని ఏపీ మంత్రి సురేష్ తెలిపారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా మహేష్ ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. వైద్య చికిత్స కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.17 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు. కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కొందరు చేస్తున్న ప్రకటనలపై మంత్రి సురేష్ స్పందించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరపటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
మహేష్ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని.. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. వారికి ఏలోటు రాకుండా చూసుకుంటామని తెలిపారు.
మందకృష్ణతోపాటు కత్తి మహేష్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణ జరుపుతోంది. ప్రధానంగా మహేష్ మరణం గురించి ఆస్పత్రి ముందుగా తమకు తెలియజేయకుండా నేరుగా మీడియాకు ఎందుకు విడుదల చేశారని మహేష్ తండ్రి ఓబులేష్ ప్రశ్నిస్తున్నారు.