Begin typing your search above and press return to search.

ఏపీలో పెద్దల సభ పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   2 March 2020 8:30 PM GMT
ఏపీలో పెద్దల సభ పరిస్థితి ఏంటీ?
X
ఏపీ శాసన మండలి ఉంటుందా? ఊడుతుందా? పెద్దల సభ పరిస్థితిపై ఇంకా డైలామా ఎందుకు కొనసాగుతోంది.? వైసీపీ ప్రభుత్వం ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రం పంపింది. అయితే టెక్నికల్ గా ఇంకా శాసన మండలి రద్దు కాలేదని టీడీపీ అంటోంది. కేంద్రం ఆమోదించే వరకు శాసన మండలి కొనసాగుతుందని టీడీపీ వాదిస్తోంది. దీనికి వైసీపీ కౌంటర్ ఇస్తోంది. వైసీపీ దృష్టిలో శాసన మండలి రద్దు చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపడంతో రద్దయినట్లే అని అంటుంది. అయితే మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలు ఒక్క శాసనసభలో మాత్రమే నిర్వహిస్తారా? లేక మండలిని కూడా నిర్వహిస్తారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

*బడ్జెట్ సమావేశాలు శాసనసభకే పరిమితమా..?
అధికారికంగా ఏపీ మండలి ఇంకా రద్దు కాలేదు. దీంతో మండలి ఇంకా ఉనికిలో ఉన్నట్లు అని టీడీపీ చెబుతోంది. అయితే ఏపీ శాసనసభ మండలిని రద్దు చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపడంతో రద్దయినట్లే అని వైసీపీ అంటుంది. బడ్జెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా శాసన మండలి నిర్వహించాల్సిన పనిలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ నియమావళి ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్-కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రకారం ఏ సభకు ఆ సభను విడి విడిగా వాయిదా వేయవచ్చు. సమావేశ పరచవచ్చు. ఈ నేపథ్యం లో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భం గా శాసనసభనే సమావేశ పరచాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

*టీడీపీ కి చాన్స్ ఇవ్వని వైసీపీ
ఏపీ శాసన మండలి రద్దు విషయం లో వైసీపీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తాజాగా బడ్జెట్ సమావేశాల్లోనూ దూకుడుగా వ్యవహరించనుంది. టీడీపీకి ఎలాంటి చాన్స్ ఇవ్వద్దని వైసీపీ భావిస్తుంది. దీంతో మండలిని సమావేశ పరచకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఎదుర్కోవాలో టీడీపీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వైసీపీ శాసన సభను మాత్రమే గవర్నర్ ద్వారా సమావేశ పరిస్తే టీడీపీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు. అయితే కోర్టు తీర్పు వచ్చేలోగా సమావేశాలు ముగిసిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

రాజధాని విషయం, సెలక్ట్ కమిటీ, తదితర విషయాలపై టీడీపీకి ఎదుర్కొనేందుకు మండలిని నిర్వహించకుండా ఉండటమే మంచిదనే భావనలో వైసీపీ ఉంది. సాధారణంగా బడ్జెట్ సమావేశం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. కానీ మండలి పరిస్థితి డైలామాలో ఉండటంతో ఏం చేయాలని ఇరుపార్టీల నేతలు న్యాయనిపుణుల సలహాలను పాటిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఏపీ పెద్దల సభ పరిస్థితిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే..