Begin typing your search above and press return to search.
టీచర్లు మా మాట వినాల్సిందే: ఏపీ సర్కారు స్పష్టం చర్చలు విఫలం
By: Tupaki Desk | 18 Aug 2022 2:35 PM GMTఏపీలో టీచర్లు వర్సెస్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ముఖ హాజరు విషయంలో ప్రభుత్వం బెట్టు వీడలేదు. అయితే.. ఈ హాజరు వద్దని.. ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టడంతో మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. తమ సెల్ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని నేతలు ఆందోళ న వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే ఫోన్లు ఇవ్వాలని కోరారు. అయితే 15 రోజుల శిక్షణ తర్వాత యాప్ అమల్లోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. అయితే.. ఉపాధ్యాయ సమస్యలపై మంత్రి బొత్స జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా సొంత సెల్‌ఫోన్లలో ముఖ ఆధారిత హాజరు యాప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ససేమిరా అన్నారు.
తమ ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే అందరికీ మొబైల్ ఫోన్లు ఇవ్వాలనే లేకపోతే పాఠశాల వద్దే మౌఖిక హాజరకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి బొత్స.. 15రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి ఆ తర్వాత యాప్ అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష మంది ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకున్నారని...మిగతా 50 శాతం మంది త్వరలోనే రిజిస్టర్ చేసుకుంటారని వివరించారు.
హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయని మంత్రి తెలిపారు. మంచి లక్ష్యానికి ఉపాధ్యాయులు సహకరించాలన్నారు. మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమల్లోకి రావొచ్చునని అన్నారు. సెల్‌ఫోన్లు ఉద్యోగులదా, ప్రభుత్వం ఇస్తుందా అనేది ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ముఖ ఆధారిత హాజరు యాప్‌పై సమన్వయలోపం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.