Begin typing your search above and press return to search.

జ‌న‌సేనానికి జ‌గ‌న్ మార్క్ షాక్ ఇదే.. ఇప్పుడేం చేస్తారో ...!

By:  Tupaki Desk   |   1 Oct 2021 3:51 PM GMT
జ‌న‌సేనానికి జ‌గ‌న్ మార్క్ షాక్ ఇదే.. ఇప్పుడేం చేస్తారో ...!
X
జ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ ప్ర‌భుత్వం అడుగ‌డుగునా చెక్ పెట్టేస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే ఏపీ స‌ర్కార్ తీసుకువ‌చ్చిన ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్య‌వ‌స్థ‌పై పెద్ద యుద్ధ‌మే చేస్తోన్న ప‌వ‌న్ ఇప్పుడు ఏపీలో రోడ్ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ రోడ్ల దుస్థితిపై సోష‌ల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నిర్వ‌హించారు. దీనికి మంచి స్పంద‌న రావ‌డంతో ప‌వ‌న్ గాంధీ జ‌యంతి రోజున రోడ్ల‌ను బాగుచేస్తూ శ్ర‌మ‌దానం చేయ‌డంతో పాటు నిర‌స‌న తెలియ‌జేయాల‌ని పిలుపు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లా ధ‌వ‌లేశ్వ‌రం బ్యారేజీతో పాటు అనంత‌పురం జిల్లాలోనూ నిర‌స‌న‌లో పాల్గోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే ప‌వ‌న్ ఆలోచ‌న‌కు ఆదిలోనే ఏపీ స‌ర్కార్ బ్రేక్ వేసింది. కాట‌న్ బ్యారేజ్ ఆర్ అండ్ బీ ప‌రిధిలోకి రాద‌ని.. బ్యారేజీపై ఉన్న గుంత‌ల‌ను కేవ‌లం సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని మాత్ర‌మే పూడ్చాల్సి ఉంటుంద‌ని చెప్పింది. దీంతో ప‌వ‌న్ అక్క‌డ శ్ర‌మ‌దానం చేసేందుకు అధికారులు నిరాక‌రించారు. ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌డంతో ప‌వ‌న్ తాను శ్ర‌మ‌దానం చేసే ప్రాంతాన్ని మార్చుకున్నారు. రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు రాజ‌మండ్రిలోని బాలాజీ సెంట‌ర్లో ఆయ‌న బ‌హిరంగ స‌భ‌కు ఏర్పాట్లు చేసుకుంటే.. అక్క‌డ కూడా తాము అనుమ‌తులు ఇవ్వ‌మ‌ని పోలీసులు ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ స‌భ‌కు 20 వేల మంది వ‌స్తార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు చెపుతున్నార‌ని.. అదే జ‌రిగితే క‌రోనా విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌ని పోలీసులు మ‌డ‌తేశారు. దీంతో ప‌వ‌న్ రాజ‌మండ్రి ప‌ర్య‌ట‌న ఉంటుందా ? లేదా ? అన్న‌దానిపై ఆ పార్టీ నేత‌లే గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. అస‌లు ప‌వ‌న్ సైతం ఏపీ ప్ర‌భుత్వం వ‌రుస షాకుల‌తో ఎలా నిర‌స‌న తెల‌పాలో ? ఎక్క‌డ తెల‌పాలో కూడా తెలయ‌ని డైల‌మాలో ఉన్నారు.

ఇదిలా ఉంటే అనంత‌పురం జిల్లాలో రెండు రోజులుగా కొన్ని చోట్ల రోడ్ల మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తోనే ప్ర‌భుత్వం ముందుగా మేల్కొని రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తులు చేస్తోంద‌ని జ‌న‌సేన నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రాజ‌మండ్రిలో ప‌వ‌న్ ప్రోగ్రామ్‌కు ప్ర‌భుత్వం నుంచి అడుగ‌డుగునా అడ్డంకులు ఉండ‌డంతో ప‌వ‌న్ రాజ‌మండ్రి వ‌స్తారా ? లేదా అనంత‌పురంకే పరిమిత‌మ‌వుతారా ? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌..!