Begin typing your search above and press return to search.
రామతీర్థం ఘటనపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 4 Jan 2021 1:54 PM GMTరామతీర్థం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలకు తగిన సమాధానం చెప్పేందుకు ఏకంగా ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
రామతీర్థం ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. సీఎం జగన్ ఆదేశాలతో దేవాదాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. రామతీర్థం ఘటనతోపాటు ఏపీలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అధికారుల నుంచి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు తీసుకున్న చర్యలు.. చేపట్టాల్సిన చర్యలు.. భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై జగన్ సమీక్షించారు. రామతీర్థం రాముడు విగ్రహం పున: ప్రతిష్టపై చర్చించారు. అధికారులు, పండితుల అభిప్రాయాలను మంత్రి తీసుకున్నారు.
నెలరోజుల్లో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. చిన్నచిన్న దేవాలయాలపై కూడా దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
ఇక రామతీర్థం ఘటనలో రెండు రోజుల్లో అరెస్టులు జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీనివెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.