Begin typing your search above and press return to search.
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ... 13 జిల్లాల్లో స్పెషల్ సబ్‌జైళ్లు !
By: Tupaki Desk | 8 July 2020 6:15 AM GMTఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. రోజూ వెయ్యి దాకా పాజిటివ్ కేసులొస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జైళ్లలో ఖైదీలకు కలుగుతున్న ఇబ్బందుల్ని పరిశీలించింది. 13 జిల్లాల్లో స్పెషల్ సబ్‌జైళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జైళ్లలో ఉన్న ఖైదీలు కరోనా బారిన పడుతుండటం వల్ల జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం స్పెషల్ జైళ్లకు తరలించాలంది.
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురంలోని జైళ్లను కరోనా జైళ్లుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా జైలుకు వచ్చే నేరస్థుల ద్వారా జైలులోపల ఉన్న ఖైదీలకు కరోనా రాకుండా ఉండేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త జైళ్ళ ఏర్పాటు తో వచ్చే నేరస్థులను మొదటగా ప్రత్యేక జైళ్లకు పంపాలని నిర్ణయించింది.
అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తేనే సాధారణ జైలుకు తరలిస్తారు. జైలులో కరోనా టెస్టులు చేసేందుకు మెడికల్ అధికారి, పారామెడికల్ అధికారిని అందుబాటులో ఉంచాలని తెలిపింది. అంతే కాకుండా సిబ్బందికి పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపింది. అలాగే , ,కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఖైదీలను వెంటనే ఆస్పత్రికి తరలించే విధంగా.. నెగెటివ్ వచ్చిన ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఉత్తర్వులు జారీ చేసింది.