Begin typing your search above and press return to search.

ర్యాగింగ్‌ కు ఏపీ టోల్ ఫ్రీ నెంబ‌ర్

By:  Tupaki Desk   |   10 Aug 2015 9:20 AM GMT
ర్యాగింగ్‌ కు ఏపీ టోల్ ఫ్రీ నెంబ‌ర్
X
ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో రితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌కు ఇష్యూలో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఏపీ స‌ర్కారు ఇప్పుడిప్పుడే కాయ‌క‌ల్ప చ‌ర్య‌ల మీద దృష్టి సారించింది. రితేశ్వ‌రి ఎపిసోడ్ లో ఏపీ స‌ర్కారు పూర్తిస్థాయిలో బ‌ద్నాం అయిన ఏపీ అధికార‌ప‌క్షం ఇప్ప‌డిప్పుడే న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది.

విశ్వ‌విద్యాల‌యంలో ఆరాచ‌క ప‌రిస్థితి నెల‌కొన్న‌ప్ప‌టికీ.. ఈ అంశంపై దృష్టి సారించేందుకు ఏపీ స‌ర్కారుకు ఇప్ప‌టికి కానీ తీర‌లేదా? అన్న విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. రితేశ్వ‌రిమృతిపై మీడియాలో జోరుగా వార్త‌లు వ‌చ్చినా ఏపీ స‌ర్కారులో పెద్ద‌గా చ‌ల‌నం లేద‌న్న మాట వినిపిస్తోంది. విమ‌ర్శ‌ల తీవ్ర‌త రోజురోజుకి పెరిగి.. ప్ర‌భుత్వ ప‌ర‌ప‌తికి ఇబ్బందిక‌రంగా మారిన నేప‌థ్యంలో ఏపీ మంత్రి గంటా స్పందించి విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేయ‌టం.. క్యాంప‌స్ లోని ప‌రిస్థితుల కార‌ణంగానే రితేశ్వ‌రి సూసైడ్ చేసుకుంద‌న్న విష‌యం మ‌రోసారి తేలింది.

న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ర్యాగింగ్ కోసం ఏపీ స‌ర్కారు విద్యార్థుల కోసం ప్ర‌త్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ర్యాగింగ్‌ పై పిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబ‌రు 1800 425 5314కు సంప్ర‌దించాల్సిందిగా కోరుతున్నారు. విద్యార్థులు త‌మ‌కున్న స‌మ‌స్య‌లు.. ఫిర్యాదుల్ని ఈ నెంబ‌రుకు ఫోన్ చేయాల‌ని కోరుతున్నారు.

రితేశ్వ‌రి ఇష్యూ మీద ఏర్పాటు చేసిన బాల‌సుబ్ర‌మ‌ణ్యం క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్ ల‌లో వీసీతో క‌లిసి రాత్రిపూట ఆక‌స్మిక త‌నిఖీలు చేయాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు..విశ్వ‌విద్యాల‌యంలోని హాస్ట‌ల్ లో ప్ర‌తి ఆర్నెల్ల‌కోసారి స‌మీక్ష నిర్వ‌హించ‌టం.. కేసుల్లో ఇరుక్కున్న విద్యార్థుల‌కు హాస్ట‌ళ్ల‌ లో చేర్చుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఒక నిండుప్రాణం పోయి.. మీడియాలో భారీగా గ‌గ్గోలు పెట్టిన త‌ర్వాత ఇప్ప‌టికి ఏపీ స‌ర్కారు స్పందించటం చూస్తే విస్మ‌యం క‌ల‌గ‌క మాన‌దు.