Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు బిగ్ షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   9 Jan 2023 1:30 PM GMT
కేసీఆర్ కు బిగ్ షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం
X
ఏపీలోకి ఘనంగా ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విభజన అంశాలపై.. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై కోర్టుకెక్కింది. 8 ఏళ్లుగా ఈ విషయంలో స్పందించకుండా జాప్యంచేస్తున్న కేసీఆర్ సర్కార్ పై ఇప్పుడు ఫైట్ మొదలుపెట్టడం బీఆర్ఎస్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది.

ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు ఏపీలో అడుగులు వేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం విభజన అంశాల అస్త్రాన్ని తెరమీదకు తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సుప్రీంకోర్టు గడప తొక్కడం.. రాజకీయంగా కేసీఆర్ కు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఎటువైపు అనుకూలంగా వ్యవహరించినా జాతీయ నేతగా.. కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవు.

విభజన చట్టంలో ఉమ్మడి ఏపీలోని ఆస్తులు జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుంది. దీనికి తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే అని చెబుతోంది. ఇక ఇప్పుడు సుప్రీం గడప తొక్కిన నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు.? అనేది ప్రశ్న.

జాతీయ పార్టీ నాయకుడు కావడంతో కేవలం తెలంగాణ వాదాన్ని వినిపిస్తే ఇబ్బందులు తప్పవు. అలాగని చట్టం ప్రకారం వెళితే ఏపీకి మెజార్టీ ఆస్తులు దక్కుతాయి. తెలంగాణ సెంటిమెంట్ కు బొక్కపడుతుంది.

ఇక ఏపీకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వమని అంటే రేపు ఏపీలో ఎలా ఓట్లు అడుగుతామన్నది ప్రశ్న. ఏపీకి అన్యాయం చేశారనే వాదన కూడా తెరపైకి వస్తుంది. ఇలాంటి సమయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం విభజన హామీలపై సుప్రీంకోర్టుకు ఎక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కు ఈ కేసు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టాలా ఉందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.