Begin typing your search above and press return to search.

కరోనా పైన ఏపీ గవర్నమెంట్ సైలెంట్?'

By:  Tupaki Desk   |   6 Feb 2020 2:30 AM GMT
కరోనా పైన ఏపీ గవర్నమెంట్ సైలెంట్?
X
కరోనా వైరస్ ..గత కొన్ని రోజులుగా చైనా తో పాటుగా ప్రపంచ దేశాల ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తున్న వైరస్. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 26 దేశాలలో విస్తరించినట్టు తెలుస్తుంది. ఈ కరోనా వైరస్ భారిన పడి ..చైనా లో ఇప్పటికే 430 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. అలాగే పదివేల మందికి పైగా ఈ వైరస్ సోకినట్టు చెప్తున్నారు. కానీ , అనధికారికంగా ఈ లెక్క ఇంకా ఎక్కువ గానే ఉన్నట్టు సమాచారం. ఇక మన దేశంలో కూడా ఇప్పటికే ఈ కరోనా వైరస్ కేసులు మూడు నమోదు అయ్యాయి. ఆ మూడు కేసులు కూడా కేరళ లోనే నమోదు కావడం గమనార్హం.

దీనితో దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్స్ లో పటిష్టమైన భద్రత ని ఏర్పాటు చేసారు. విదేశాల నుండి వచ్చేవారిని క్షుణ్ణంగా వైద్యనిపుణుల సమక్షంలో పరిశీలించిన తరువాత , వారికీ కరోనా వైరస్ సోకలేదు అని నిర్దారించుకున్న తరువాతే వారిని బాహ్య ప్రపంచంలోకి పంపిస్తున్నారు. ఇకపోతే ఈ వైరస్ చైనా లో ప్రభలుతున్న నేపథ్యం లో అక్కడున్న మన వారిని కేంద్రం స్పెషల్ గా విమానాన్ని పంపి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

కాగా , చైనా లో తెలుగు వారు కూడా అధికంగా ఉన్నారు. వారిలో తెలంగాణ కి చెందిన వారు , ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా చైనా లో ఉన్న తెలుగు వారిలో ఏపీకి చెందిన వారే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాదకరమైన కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి ..హైదరాబాద్ లో ఫ్రీ కరోనా చెకప్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఎవరికైనా కరోనా సోకినట్టు అనుమానం ఉంటే వచ్చి చెకప్ చేపించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఇప్పటికే డాక్టర్స్ కూడా ఫ్రీ చెకప్ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై అసలు ఫోకస్ పెట్టినట్టే కనిపించడం లేదు. పూర్తిగా కరోనా వైరస్ పై ప్రేక్షక పాత్ర వహిస్తూ ..సైలెంట్ గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు కారణ మౌతున్న కరోనా వైరస్ పై చర్యలు ఇంకా తీసుకోవడం లేదు అని పరిశీలకులు అంటున్నారు .