Begin typing your search above and press return to search.

విశాఖలో అమ్మకానికి 4 వేల ఎకరాలు సిద్ధం..నవరత్నాల అమలుకోసమేనా!

By:  Tupaki Desk   |   3 Feb 2020 12:15 PM GMT
విశాఖలో అమ్మకానికి 4 వేల ఎకరాలు సిద్ధం..నవరత్నాల అమలుకోసమేనా!
X
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక సంచలనమైన నిర్ణయాలతో దూసుకుపోతుంది .తాజాగా మరో వ్యూహాత్మకమైన కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అమరావతి - విశాఖ - కర్నూల్ లో రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై అసెంబ్లీ లో పెట్టిన బిల్లు . అసెంబ్లీ లో ఆమోదం పొందినప్పటికీ కూడా మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయం పై వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల నిర్మాణం కూడా ప్రారంభం అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బిల్డ్ ఏపీ కోసం అని విశాఖ చుట్టుపక్కల ఉన్న సుమారు 4 వేల ఎకరాల ప్రభుత్వం భూమిని గుర్తించి - అమ్మబోతున్నట్టు - దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం పై మరో విమర్శ కూడా వినిపిస్తుంది. అయితే , వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేస్తున్న నవరత్నాల పథకాల కోసమే ఈ బిల్డ్ ఏపీ కింద 4 వేల ఎకరాలని అమ్మబోతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

విశాఖలో బిల్డ్ ఏపీ కోసం గుర్తించిన 4 వేల ఎకరాలని అమ్మేసి ఏపీ అభివృద్ధికి ఉపయోగిస్తే ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ - బిల్డ్ ఏపీ కోసం అని అమ్మి - ఒకవేల నవరత్నాల పథకాల అమలుకోసం ఉపయోగిస్తే మాత్రం వైసీపీ సర్కార్ విమర్శల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న ఈ సమయంలో ఈ వార్తలు కనుక నిజమైతే ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు తోడైనట్టే ..