Begin typing your search above and press return to search.

'మాజీ' లకి పింఛన్ కట్ ..సీఎం కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   28 Jan 2020 11:55 AM GMT
మాజీ లకి పింఛన్ కట్ ..సీఎం కీలక నిర్ణయం !
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఎటువంటి దుబారా ఖర్చులకి పోనటువంటి సీఎం జగన్ .. రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రూపాయికి రూపాయిని చేర్చుతూ ప్రజా అవసరాలని తీర్చడానికి వినియోగిస్తున్నారు. అలాగే తాజాగా మండలిని కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ లో ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారని - విద్యావేత్తల కోసం ప్రత్యేకంగా మళ్లీ మండలిని నడిపించడం అనవసర ఖర్చు అంటూ మండలిని సైతం రద్దు చేసేసారు.

స్వతంత్రమొచ్చిన తొలి నాళ్ళలో అక్షరాశ్యుల సంఖ్య తక్కువ. అలంటి సమయంలో కొంచెం ప్రజాభిమానం కలిగిన వ్యక్తులు చట్టసభల్లోకి ప్రవేశించే వారు. అయితే రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుని అందుకనుగుణంగా పాలన సాగించగలిగే సామర్ద్యం - విజ్ఞానం వారికుండేవి కాదు. ఈ కారణంతో చదువరులు, వివిధ రంగాల్లో నిష్ణాతుల్తో కూడిన ఎగువసభల ఆవశ్యకతను రాజ్యాంగంలో పొందుపర్చారు. అయితే ఇప్పుడు నిరక్ష రాశ్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. చట్టసభల్లోకి విద్యాధికులు - వైద్యులు - లాయర్లు - ఇంజనీర్లు - సివిల్‌ సర్వీస్‌ అధికార్లు కూడా ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలి అంటూ ప్రత్యేకంగా మరో సభ అవసరం కనిపించడం లేదు. అలాగే రెండోసభ నిర్వహణకు పెద్దెత్తున ఆర్ధిక వనరులు ఖర్చవుతున్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల్నుంచి ఎన్నికైన ప్రతినిధుల నిర్ణయాల్ని - మండలిలోకి దొడ్డిదారిన వచ్చిన కొంతమంది ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది. దీనితో జగన్ సర్కార్ మండలిని రద్దు చేయాలంటూ నిర్ణయం తీసుకుంది.

అయితే , అనవసర వ్యయ నియంత్రణ ఇంతటితో ఆగిపోదు. రాష్ట్రంలో చట్టసభల మాజీ సభ్యులు 1300మందికి పైగానే ఉన్నారు. నాలుగున్నరేళ్ళకు పైగా చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తే జీవితాంతం పెన్షన్‌ కు అర్హులుగా పరిగణినించి పెన్షన్‌ ను చెల్లిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంచుకున్న ప్రతిసారి మాజీలకి పెన్షన్లను కూడా సవరిస్తున్నారు. దీనితో వీరికి పెన్షన్ల పేరిట కోట్ల రూపాయల్ని ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి భారమంటూ గతంలోనే పలు ప్రజాస్వామ్య సంఘాలు విమర్శలు చేసినప్పటికీ , ఎవరైనా కూడా కొంతకాలం తరువాత మాజీలు కావడం ఖాయం కావడంతో పెన్షన్ల విషయంలో సభ్యులు సానుకూల విధానాన్నే అనుసరిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్..చట్టసభల మాజీ సభ్యుల పెన్షన్లపై కూడా నిర్ణయాన్నితీసుకునేందుకు సిద్ధమౌతోంది అని సమాచారం. ఇప్పటికే ఈ దిశగా ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనిపై ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. అలాగే కేబినెట్‌ మంత్రులు ప్రస్తుతం అందుకుంటున్న జీతభత్యాలు - ఇతర ప్రోటోకాల్‌ సదుపాయాల్ని ప్రభుత్వం నియమించే కార్పొరేషన్‌ చైర్మన్లు - సలహాదార్లకు కూడా వర్తింపజేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి నెలవారీ నాలుగున్నర లక్షల వరకు చెల్లిస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సలహాదార్లు - కార్పొరేషన్‌ చైర్మన్‌ ల జీతభత్యాలకు కత్తెరేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. చూడాలి మరి దీనిపై మాజీ ప్రజాప్రతినిథులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ....