Begin typing your search above and press return to search.
ఆ ఓడను భారీ రేటుకు కొనబోతున్న జగన్ సర్కార్
By: Tupaki Desk | 18 Dec 2020 5:30 PM GMTఏపీలో కొలువుదీరిన జగన్ సర్కార్ ప్రతీదాన్ని క్యాష్ చేసుకుంటోంది. ప్రజలకు సంక్షేమం అందించడంతోపాటు అలాగే ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తీర ప్రాంత నగరమైన విశాఖకు మరిన్ని సొబుగులు అద్దాలని నిర్ణయించింది. అందుకు గల ఏ అవకాశాన్ని వదలుకోవడం లేదు.
ఇటీవల విశాఖపట్నానికి బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఓడ కొట్టుకొచ్చింది. ఇటీవల వచ్చిన తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు బంగ్లాదేశ్ కు చెందిన వాణిజ్య నౌక ‘ఎంవీ మా’ విశాఖ ఔటర్ హార్బర్ నుంచి నాలుగు నాటికల్ మైళ్లు ప్రయాణించి విశాఖపట్నంలోని తెన్నీటి పార్క్ వద్ద తీరానికి కొట్టుకొచ్చింది.
అయితే దాన్ని తిరిగి బంగ్లాదేశ్ జలల్లోకి తరలించేందుకు భారీ మొత్తంలో ఖర్చు కానుంది. దీంతో ఆ తీరంలోనే దాన్ని యజమాని వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది.
విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసి టూరిస్టులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని భావిస్తోంది. ఏకంగా రూ.10 కోట్లతో ఈ ఓడను కొనాలని నిర్ణయించింది. అనంతరం ఈ ఓడను రెస్టారెంట్ గా మార్చాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
ఈ మేరకు సచివాలయంలో ఏపీ టూరిజం అధికారులతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమై చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ ఓడ యజమానితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఓడను కొని పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు చేపట్టి రెస్టారెంట్ గా మార్చేలా అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.