Begin typing your search above and press return to search.
రూ.2వేల కోట్ల దసపల్లా భూముల్ని కోల్పోనున్న ఏపీ సర్కార్
By: Tupaki Desk | 3 Oct 2022 4:16 AM GMTఒకటి కాదు రెండు కాదు. ఏకంగా రూ.2వేల కోట్ల విలువైన భూములు. సరైన వాదనలు వినిపించి.. గట్టిగా ప్రయత్నించి ఉంటే వందలాది కోట్ల రూపాయిల విలువ చేసే భూములు ఏపీ సర్కారు చేతుల్లో ఉండే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిస్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన భూముల విషయంలో అధికారులు ఉదాసీనత.. ప్రభుత్వానికి పెద్దగా పట్టకపోవటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నుంచి చేజారకూడదన్న పట్టుదల ప్రదర్శించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు.
ముందుచూపు లేకపోవటం.. కోర్టుల్లో బలంగా వాదనలు వినిపించకపోవటం.. రూల్స్ అమలులో నెలకొన్న తప్పిదాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత చేసిన ప్రయత్నాలు.. తెర వెనుక తిప్పిన చక్రంతో ఇంతటి విలువైన భూములు ప్రభుత్వం నుంచి చేజారే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఇంతటి విలువైన భూములు ప్రభుత్వ చేతుల నుంచి చేజారేలా అధికారుల ప్లానింగ్ ఉండటం షాకింగ్ గా మారింది.
విశాఖలోని దసపల్లా హిల్స్ లోని పలు సర్వే నెంబర్లలో 60 ఎకరాల భూములు రాణీ కమలాదేవికి ఆమె తండ్రి నారాయణ గజపతి రాజు నుంచి 1938లో సంక్రమించాయి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు శిస్తు చెల్లించకపోవటంతో 1958లో ఈ భూములకు రాణీ కమలాదేవి గ్రౌండ్ రెంట్ పట్టా లభించింది. 1976లో భూ గరిష్ఠ పరిమితి (యూఎల్ సీ) చట్టం వచ్చింది. దీంతో రాణి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1500 గజాల భూమిని ఆమెకు ఇచ్చేసి మిగిలిన భూముని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ఒక్కొక్కరికి 1500 గజాల చొప్పున ఇవ్వాలని కోరగా.. అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టుకు వెళ్లారు. ఈ కేసు అప్పటి నుంచి ఇప్పటివరకు తేలలేదు. భూముల అంశం కోర్టులో ఉన్నప్పటికీ విశాఖ టౌన్ ప్లానింగ్ అధికారులు 1980లో మొత్తం 60 ఎకరాల్లో ఉన్న కొండ ప్రాంతంలోని 20 ఎకరాల్ని వదిలేసి.. మిగిలిన 40 ఎకరాల్ని లేఔట్ వేసి అమ్మేశారు. ఒక్క ఎకరాన్ని మాత్రం నౌకాదళ అవసరాలకు కేటాయించారు.
అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు 40 ఎకరాల భూములకు రాణీ కమలాదేవికి పరిహారాన్ని చెల్లించారు. మిగిలిన 20 ఎకరాల్ని నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో ఐదు ఎకరాలు ఇప్పటికే అక్రమణల పాలయ్యాయి. మిగిలిన 15 ఎకరాల్ని రాణీ కమలాదేవి కుటుంబ సభ్యులు అనధికారికంగా అమ్మేసుకున్నారు. రాణికి జారీ చేసిన గ్రౌండ్ రెంట్ పట్టా చెల్లదని పేర్కొంటూ అధికారులు కోర్టుకు వెళ్లారు.
అయితే.. ఈ కేసులో సర్వే అండ్ సెటిల్ మెంట్ కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు.. సుప్రీంకోర్టు ల్లో మాత్రం రాణీ కమలాదేవి గెలిచారు. టైటిల్ మీద ఫోకస్ చేసిన అధికారులు యూఎల్ సీ వ్యవహరాన్ని పక్కన పెట్టేయటం సమస్యగా మారింది. 2009లో హైకోర్టు నాటి ప్రభుత్వ పిటిషన్ ను రిజెక్టు చేయటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
90 రోజుల్లో వేయాల్సిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను 570 రోజుల తర్వాత దాఖలు చేశారు. సకాలంలో దీన్ని వేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతేకాదు.. యూఎల్ సీ కేసు ఆధారంగా ముందుకు వెళ్లినా ప్రయోజనం ఉండేదన్న వాదన ఉండేది. అయితే.. స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లోకి ఈ భూములు వెళ్లటం.. తాజాగా వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తిప్పుతున్న చక్రంతో ఈ విలువైన భూమి ప్రభుత్వం నుంచి చేజారిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.