Begin typing your search above and press return to search.

ఈనాడు రామోజీపై జగన్ ఇలా ప్రతీకారం

By:  Tupaki Desk   |   24 Dec 2022 1:02 PM GMT
ఈనాడు రామోజీపై జగన్ ఇలా ప్రతీకారం
X
చంద్రబాబుకు అండగా.. ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ వైఎస్ఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా సాగుతున్న ఈనాడు రామోజీరావును దెబ్బతీయాలని నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ చేయని ప్రయత్నం లేదు. జగన్ పై ఇప్పటికే పుంకానుపుంకాలుగా కథనాలు రాసి దెబ్బతీసిన ఈనాడు పత్రికను ప్రతీసారి జగన్ టార్గెట్ చేస్తూనే ఉంటాడు. రామోజీరావు ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడు. తాజాగా మార్గదర్శి చిట్స్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది.

కోర్టులో ఇటు మార్గదర్శి వాదన.. ఇటు మార్గదర్శిపై కేసులు పెట్టిన ప్రభుత్వం వాదన విన్నాక తీర్పు రిజర్వ్ అయ్యింది. అది ఎప్పుడు వెల్లడిస్తారన్నది చూడాలి. ఇందులో కీలక పాయింట్ ఎంటంటే.. మార్గదర్శిలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని గతంలో ప్రభుత్వం సోదాలు చేసింది. అయితే అసలు కాగితాలు ఇవ్వలేదని.. హెడ్ క్వార్టర్ ఆఫీసులోనూ మార్గదర్శి ఉద్యోగులు సహకరించలేదని ప్రభుత్వం వాదించింది.

అయితే ప్రభుత్వం సోదాలు చేసేటప్పుడు కంపెనీ ఇంటర్నల్ కు సంబంధించిన మెయిల్స్ అడిగారని..అది ఇవ్వమని చెప్పామని.. మిగతా అన్నీ ఇచ్చామని మార్గదర్శి చెబుతోంది. అయితే మార్గదర్శి చిట్ ఫండ్ డబ్బులను అదే సంస్థలో ఉంచాలని.. కానీ వాటన్నింటిని రామోజీరావు తన ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారని ప్రభుత్వం వాదించింది. ఇది నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఉషా కిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, ఉషోదయ పబ్లికేషన్స్, రమాదేవి ట్రస్ట్ వంటి అనుబంధ కంపెనీలకు మార్గదర్శి చిట్స్ నిధులు అక్రమంగా మళ్లించారని.. కార్పొరేట్ ఖాతాల్లో జమచేసింది ప్రభుత్వం వాదించింది. ప్రత్యేక ఖాతాల్లో జమ చేయకుండా ఇలా డబ్బులను మళ్లించడం అక్రమం అని ఆరోపించింది.

ఎన్నో ఏళ్లుగా ఇది సాగుతోందని.. ప్రజల డబ్బును చిట్స్ పేరుతో మార్గదర్శి తీసుకొని ఇతర సంస్థల్లోకి మళ్లించి ఆర్థికంగా ఎదిగిందని ఏపీ ప్రభుత్వం కోర్టులో వాదించింది. ప్రతీ చిట్ ఆస్తి, అప్పులు చిట్టా రూపొందించకుండా ఇలా చేసిందని ఆరోపించారు.

నిబంధనలు అతిక్రమించారని జగన్ ప్రభుత్వం ఏపీలో కొత్త చిట్స్ వేయకుండా నిషేధించింది. జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో మార్గదర్శికి డబ్బులు జమ కాక దెబ్బతింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని మార్గదర్శి కోర్టులో వాదించింది.

దీంతో మార్గదర్శి వాదన సరైందా? జగన్ ప్రభుత్వం నిషేధం కరెక్టా? అన్న దానిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచిచూడాలి. ఇందులో మార్గదర్శి కొత్త చిట్టీలు వేయకుండా ఏపీలో నిషేధించి కోర్టుకు ఎక్కి జగన్ ఈనాడు రామోజీరావును ఆర్థికంగా దెబ్బతీశాడని తెలుస్తోంది. కోర్టు తీర్పుపై ఆసక్తి రేపుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.