Begin typing your search above and press return to search.

అటు కోర్టులో విచార‌ణ‌.. ఇటు ప‌రీక్ష‌ల‌ షెడ్యూళ్ల ప్ర‌క‌ట‌న‌..!

By:  Tupaki Desk   |   24 Jun 2021 11:42 AM GMT
అటు కోర్టులో విచార‌ణ‌.. ఇటు ప‌రీక్ష‌ల‌ షెడ్యూళ్ల ప్ర‌క‌ట‌న‌..!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విద్యార్థుల ప‌రీక్ష‌ల విష‌య‌మై సుప్రీంలో విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే.. మ‌రో ప‌రీక్ష‌కు షెడ్యూల్ విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా వేసిన టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లను త్వ‌ర‌లో నిర్వ‌హించేందుకు ఏపీ స‌ర్కారు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ.. దాఖ‌లై పిటిష‌న్లను విచారించిన‌ సుప్రీం కోర్టు.. స‌ర్కారుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.

డెల్టా ప్ల‌స్ వంటి వేరియంట్లు ఆందోళ‌న క‌లిగిస్తున్న స‌మ‌యంలో.. ప్ర‌భుత్వం ఇలా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తోందో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాక‌ థ‌ర్డ్ వేవ్ వ‌స్తే.. ఏం చేస్తార‌ని నిల‌దీసింది. క‌రోనాతో ఒక్క విద్యార్థి ప్రాణం కోల్పోయినా.. కోటి రూపాయ‌ల ప‌రిహారం చెల్లించాల‌ని చెప్పింది.

ఈ విధంగా టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే.. ఎంసెట్ ప‌రీక్ష‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి ఒమ‌ర్ జ‌లీల్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేశారు.

దీని ప్ర‌కారం.. జూన్ 30 వ‌ర‌కు ఫైన్ లేకుండా ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత రూ.5 వేల ఫైన్ తో జులై 7 వ‌ర‌కు, ప‌ది వేల రూపాయ‌ల ఫైన్ తో జులై 14 వ‌ర‌కు, రూ.15 వేల ఫైన్ తో జులై 22 వ‌ర‌కు, రూ.20 వేల ఫైన్ తో జులై 29 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

ఇక‌, క‌రోనా భ‌యం నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని, విద్యార్థుల మ‌ధ్య భౌతిక దూరం, శానిటైజ్ వంటి ప్ర‌క్రియ‌లు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఈ ప‌రీక్ష అనంత‌రం ఐసెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, ఎడ్ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను సెప్టెంబ‌ర్ రెండో వారంలో నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు.