Begin typing your search above and press return to search.
మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టు రద్దు
By: Tupaki Desk | 9 Aug 2019 6:34 AM GMTమచిలీపట్నం పోర్ట్ కాంట్రాక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ (ఎంపీపీఎల్) కంపెనీని నెలకొల్పారు. దానికి నవయుగ కంపెనీ లీడ్ ప్రమోటర్ గా ఉంది. 12000 కోట్ల రూపాయల ఖర్చుతో మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది. అందుకు గాను 412 ఎకరాల భూములను కూడా ఎంపీపీఎల్ కంపెనీకి కేటాయించింది. గతంలో చేసుకున్న ఈ కాంట్రాక్ట్ ఒప్పందాల్ని రద్దు చేస్తూ గురువారం రాత్రి ఏపీ ప్రభుత్వం జీవో నెం 02ను జారీ చేసింది. బందరు పోర్టు కోసం 2010 జూన్ నుంచి చేసిన అన్ని ఒప్పందాలు దీనితో రద్దు అయ్యాయి. ఈ జీవోలో డెవలపర్ కి ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపింది. అంతేగాకుండా ప్రభుత్వానికి జరిగిన నష్టానికి ఎంపీపీఎల్ నుంచి పరిహారం కోరే హక్కు కూడా ప్రభుత్వానికి ఉందంటూ జీవోలో పేర్కొంది.
ఈరోజు ముఖ్యమంత్రి జగన్ పెట్టుబడలు సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులతో పాటు మరో నాలుగు కొత్త పోర్టులు నిర్మిస్తామని ప్రకటించారు. పోలవరం కాంట్రాక్టును కూడా ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. పోలవరం పనులు కూడా నవయుగ కంపెనీ మొన్నటి వరకు చేసింది.