Begin typing your search above and press return to search.
ఉద్యోగులతో ఢీకొడుతున్న ఏపీ సర్కారు ?
By: Tupaki Desk | 27 July 2022 9:05 AM GMTలక్షా 92 వేల మంది దాచుకున్న మొత్తాలనూ గంపగుత్తగా సెక్యూరిటీ కింద చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రుణం పొందేందుకు పావులు కదుపుతోందని తాజా ఆరోపణ ప్రభుత్వంపై వస్తోంది. ఇందుకు కేంద్రం కూడా సూత్ర ప్రాయంగా అంగీకారం కూడా తెలిపిందని వార్తలు వస్తున్నాయి.
ఈ లెక్కన సీపీఎస్ ఉద్యోగులు దాచుకున్న మొత్తాలను ష్యూరిటీ కింద చూపిస్తూ నాలుగువేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అప్పురూపంలో కేంద్రం నుంచి లాగేయ్యడం అనూహ్యమైన నిర్ణయం అని... ఉద్యోగులే కాదు సామాన్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఓ వైపు సీపీఎస్ రద్దు చేస్తారా లేదా అని ఉద్యోగులు కండుపు మండి రోడ్డెక్కి నినదిస్తుంటే, మరోవైపు గుట్టురట్టు కాకుండా జాగ్రత్త పడుతూ మూడో కంటికి తెలియకుండా సీపీఎస్ ఉద్యోగులు రేపటి అవసరాల నిమిత్తం తమ వంతుగా ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులపై సైతం ప్రభుత్వం కన్నెయ్యడం ఎంత దారుణం అంటున్నాయి విపక్షాలు.
ఓ విధంగా ఇది కొత్త పరిణామం మాత్రమే కాదు ప్రమాదకరనమైన నిర్ణయం అని అప్పులు తె చ్చుకునే పద్ధతుల్లో ఇది వరకూ ఎవ్వరూ పాటించని విధానమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజా ప్రభుత్బ నిర్ణయం ఉద్యోగ వర్గాలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి జగన్ ను అధికారంలోకి తెచ్చిన కీలక హామీల్లో ఒకటి సీఎం అయిన వెంటనే వారంలోపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు ఒకటి. జగన్ పై ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఆయన మాట తప్పారని ఉద్యోగులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.
ఇదే సందర్భంలో సీపీఎస్ రద్దు సాధ్యం కాదన్న ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి మాట విన్నాక మండిపడుతున్నాయి. అందుకే పదవీ విరమణ తరువాత ఎటువంటి ఆర్థిక భద్రత కానీ భరోసా కానీ ఇవ్వని సీపీఎస్ ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ లో మిలీనియం మార్చ్ కు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంఘటితం అయి ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్న తరుణాన ఇప్పుడొక చేదు వార్త వినిపిస్తోంది. దీంతో ఉద్యోగుల నుంచి జగన్ కు గట్టి హీట్ తగలనుందని అర్థమైపోతుంది.