Begin typing your search above and press return to search.

వినాయకచవితి వేడుకలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   3 Sep 2021 4:12 AM GMT
వినాయకచవితి వేడుకలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తగ్గినప్పటికీ , ఇంకా పూర్తిగా తగ్గలేదు. మళ్లీ గత వారం రోజుల్లో కరోనా మహమ్మారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అలాగే దేశంలో మూడో వేవ్ రాబోతుందని కొందరు నిపుణులు నిపుణులు అంచనా వేసి చెప్తున్నారు. మరికొందరు థర్డ్ వేవ్ రాదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా రాష్ట్రంలో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ కొనసాగింపు అమల్లో ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖను సీఎం ఆదేశాలిచ్చారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరనే మాటలు ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రెండుసార్లు బయోమెట్రిక్‌ తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందుల రాకూడదని సీఎం అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని, ప్రభుత్వ ఆసత్పుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ఈమేరకు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వచ్చే ఫిబ్రవరి చివరినాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్నదానిపై ఒక ఆలోచన కూడా చేయాలని సీఎం ఆదేశించారు.

ఇక వచ్చేది పండుగల సీజన్ కాబట్టి దీనిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక త్వరలో రాబోయే వినాయక చవితి పండుగ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా పండగల సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలని, వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని వైద్యుల సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు మత్రమే అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 59,566 నమూనాలను పరీక్షించగా.. 1378 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1378 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,16,680కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు.