Begin typing your search above and press return to search.
రేషన్ వాహనాలపై జగన్ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 27 July 2021 4:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు ఏపీ సర్కారు దాదాపు 9 వేలకు పైగా మినీ ట్రక్కులను కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రక్కును లబ్ధిదారులకు అందజేసింది కూడా. అయితే.. ఈ ట్రక్కులకు కట్టాల్సిన డబ్బులను ప్రభుత్వం-లబ్ధిదారుల భాగస్వామ్యంతో చెల్లిస్తున్నారు.
తొలుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ట్రక్కు వ్యయంలో 60 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 40 శాతాన్ని లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ఇందులోనూ సవరణ చేసింది. లబ్ధిదారులుగా ఉన్నవారు షెడ్యూల్ కులాలకు చెందిన వారు కావడంతో.. వారికి మరింత మేలు చేసేలా నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ సబ్సిడీ 60 శాతాన్ని ఏకంగా 90 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే.. లబ్ధిదారుడు కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుందన్నమాట. అంతేకాదు.. ఈ డబ్బు చెల్లింపునకు భారీగా వాయిదాలను ఇచ్చింది. ఈ పది శాతం సొమ్మును 72 వాయిదాల్లో చెల్లించొచ్చని ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దళితులకు మేలు చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ వాహనాల ద్వారా గత జనవరి నుంచి రేషన్ సరుకులను ఇంటింటికీ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.