Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: మెడిసిన్స్ కొనే వాళ్లపై నిఘా
By: Tupaki Desk | 26 April 2020 11:51 AM GMTఏపీలో కరోనా వైరస్ ను మరింత కట్టడిచేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది. ముఖ్యంగా కరోనా లక్షణాలున్నా బయటపడకుండా మందులతో కవర్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ స్టోర్ల నుంచి దగ్గు, జలుబు మరియు జ్వరాల కోసం ఔషధాలను కొనుగోలు చేసేవారిని ట్రాక్ చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు మొబైల్ అప్లికేషన్ "కోవిడ్ ఫార్మా" ను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య విభాగం శనివారం ప్రారంభించింది.
యాప్‌ను ఉపయోగించి, సంబంధిత ఫార్మసీలు వారి మొబైల్ నంబర్‌తో సహా వ్యక్తుల వివరాలను ఈ యాప్ లో ఎంటర్ చేయాలి. సాధారణ రోగులు సైతం మెడికల్ షాపులో మందులు కొంటే వీటిని ఇవ్వాల్సిందే. ఈ డేటాను మెడికల్ స్టోర్స్ వారు ప్రభుత్వానికి నివేదించాలి.
"ప్రస్తుత పరిస్థితులలో, కరోనావైరస్ ఏవైనా లక్షణాలు ఉన్న వ్యక్తులను సులభంగా గుర్తించడంలో ఇది మాకు సహాయపడుతుంది" అని ఏపీ ఆరోగ్య కమిషనర్ భాస్కర్ చెప్పారు. ప్రిస్క్రిప్షన్ తో మందులు కొన్నవారిని కూడా రిపోర్ట్ చేయాలని సూచించారు. తమ వద్ద ఇలా మెడిసన్స్ కొనుగోళ్లు చేస్తున్న వ్యక్తుల వివరాలను సేకరించి ఆరోగ్య శాఖతో పంచుకునేందుకు మెడికల్ షాపుల సంఘం అంగీకరించిందని ఆయన అన్నారు.