Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ ను క‌లిశారని..ఉపాధ్యాయుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు

By:  Tupaki Desk   |   2 Oct 2018 12:58 PM GMT
జ‌గ‌న్‌ ను క‌లిశారని..ఉపాధ్యాయుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు
X
గతేడాది నవంబర్‌ 6న ఇడుపుల పాయలో ప్రారంభమైన పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటి దిగ్విజయంగా కొనసాగుతోంది. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. ప్ర‌జ‌ల తీరుపై తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలతో జ‌గ‌న్ మ‌మేకం అవుతున్నారు. ఈ క్ర‌మంలో కప‌లు వ‌ర్గాల వారు త‌మ ఆవేద‌న‌ను జ‌గ‌న్‌ తో పంచుకుంటున్నారు. మ‌ధ్యాహ్న భోజ‌న కార్మికులు - పారిశుద్ధ్య కార్మికులు - జేఎన్‌ టీయూ కాంట్రాక్టు అధ్యాపకులు - 104 ఉద్యోగులు క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. అయితే ఈ బితాలో ప‌లువురు ఉపాధ్యాయులు ఉండ‌గా...వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.

కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ విధానంపై ఉపాధ్యాయులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవల వైఎస్‌ జగన్‌ ను తొమ్మిది మంది ఉపాధ్యాయులు కలిసి సీపీఎస్‌ ను రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీనికి జ‌గ‌న్ స్పందిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆ తొమ్మిదిమంది ఉపాధ్యాయులు ఆదివారం పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ ను కలిసి సంఘీభావం తెలిపారు. అయితే వీరిపై విద్యా శాఖ కన్నెర్ర చేసిన‌ట్లు స‌మాచారం. ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నందుకు - వైఎస్ జ‌గ‌న్‌ తో స‌మావేశం అయ్యేందుకు తొమ్మిది మంది ఉపాధ్యాయులపై విద్యాశాఖ వేటు వేసే యోచనలో ఉందని స‌మాచారం. ఇప్ప‌టికే స‌ద‌రు ఉపాధ్యాయుల వివ‌రాలు సేక‌రించిన‌ట్లు చెప్తున్నారు.