Begin typing your search above and press return to search.

మూడ్ మారలేదు.. షిఫ్టింగ్ తప్పదు... ?

By:  Tupaki Desk   |   8 Dec 2021 12:30 AM GMT
మూడ్ మారలేదు.. షిఫ్టింగ్ తప్పదు... ?
X
ప్రభుత్వం మూడ్ అలాగే ఉంది. గట్టిగా చెప్పాలీ అంటే అది మూడు మీదనే నిలిచి ఉంది. మూడు తోనే ముందుకు అంటోంది అధికార వైసీపీ. దానికి తగినట్లుగా చకచకా అడుగులు వేస్తోంది. నిజానికి మూడు రాజధానుల పేరిట కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చి రెండేళ్ళుగా ఏపీలో రాజకీయ రచ్చ రేపిన వైసీపీ ఈ మధ్యనే సడెన్ గా ఆ చట్టాన్ని రద్దు చేసుకుంది.

అయితే అది వెనకడుగు ఎంతమాత్రం కాదని, ముందుకే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిండు సభలో చెప్పారు. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు పరిశీలిస్తే ప్రభుత్వం ఎక్కడా తగ్గడంలేదు అనే అంటున్నారు. ఏపీలో న్యాయ రాజధానిగా కర్నూల్ ని చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

దానికి వీలుగా కర్నూల్ లో ఇప్పటికే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఆఫీసులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం లేటెస్ట్ గా మరో షాకింగ్ డెసిషన్ తీసుకుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ ని కూడా కర్నూల్ కి షిఫ్ట్ చేసింది. దాంతో ఇంకా ఎన్ని ఈ లిస్ట్ లో ఉన్నాయన్న చర్చ అయితే వస్తోంది. చంద్రబాబు సీఎం గా ఉండగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అక్కడే అనేక ఆఫీసులను ఆయన ఏర్పాటు చేశారు.

అయితే దాన్ని తోసిరాజని ఇపుడు జగన్ చాలా ఆఫీసులను వేరే చోట్లకు షిఫ్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. న్యాయ రాజధానిగా కర్నూల్ ని మార్చాలీ అంటే అక్కడ హై కోర్టు రావాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదంతో అది సాధ్యపడుతుంది. ఇక మూడు రాజధానుల మీద హై కోర్టులో ఎన్నో కేసులు పడ్డాయి. దాంతో ఆ విచారణ సాగుతూండగానే మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయడంతో జగన్ సర్కార్ ఇపుడు మరింత పకడ్బందీగా కొత్త చట్టం తీసుకువస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెడతారు అంటున్నారు.

మొత్తానికి మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ ఎంతటి పట్టుదలతో ఉందో తాజాగా వక్ఫ్ ట్రిబ్యునల్ తరలింపుతో అర్ధమవుతోంది అంటున్నారు. చూడాలి మరి రానున్న కాలంలో ఇంకా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో.