Begin typing your search above and press return to search.
ఎవరైనా లంచం తీసుకుంటే.. జగన్ సంచలన నిర్ణయం!
By: Tupaki Desk | 24 Aug 2020 2:02 PM GMTపరిపాలనలో పారదర్శకతకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. అవినీతి నిరోధం, ప్రభుత్వ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీపీ ఆంజనేయులు, ఉన్నతాధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు.
ఏపీలో ఇకపై లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని జగన్ నిర్ణయించారు. ‘దిశ’ తరహాలోనే అసెంబ్లీలో దీనిపై బిల్లు పెట్టే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారు.
ఇందుకోసం ఏసీబీకి 14400 నంబర్ ను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నారు.
ప్రభుత్వంలోని ప్రతీ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ చేయాలని.. టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందేనని తేల్చారు. అవినీతిపై త్వరలోనే చట్టం తీసుకురానున్నట్టు తెలిసింది.