Begin typing your search above and press return to search.
విశాఖకు వచ్చేయాల్సిందే.... ?
By: Tupaki Desk | 29 Oct 2021 3:30 PM GMTవైసీపీ మూడు రాజధానుల మీద పట్టుదలగా ఉంది. ఈ విషయంలో రెండవ మాట లేదు అంటోంది. ఇప్పటికే సగం పాలన గడచిపోయింది. ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదు అన్నది వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది. రానున్న రోజుల్లో విశాఖ రాజధానిగా చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల మీద చట్టం చేశారు. అయితే అది న్యాయస్థానం ముందు ఉంది. తీర్పు ఎపుడు వస్తుందో తెలియదు. అయితే జగన్ మాత్రం విశాఖ పట్ల తన ప్రేమను ఎప్పటికపుడు చాటుకుంటూనే ఉన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న జగన్ ఆలోచనలను చూస్తే కనుక విశాఖ కచ్చితంగా ఏదో నాడు రాజధాని అవడం ఖాయమని చెప్పవచ్చు.
విశాఖలోని ప్రైమ్ ఏరియాగా భావించే మధురవాడలో 130 ఎకరాలను అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించడం చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల విశాఖ ఐటీ రాజధానిగా మారుతుంది. ఏకంగా పదిహేను వేల కోట్ల పెట్టుబడులతో ఆదానీ సంస్థ విశాఖలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లని ఏర్పాటు చేయనుంది. దీని వల్ల ప్రత్యక్షంగానే దాదాపుగా పాతిక వేల మంది దాకా ఉపాధిని పొందనున్నారు. అదే సమయంలో ఐటీ అనుబంధ పరిశ్రమలు కూడా విశాఖకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది.
ఇక ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత ఐటీ పరంగా విశాఖనే చెప్పుకునేవారు. ఇపుడు విభజన ఏపీలో విశాఖ ఆ స్థాయిని అందుకోవాలని జగన్ సర్కార్ చేస్తున్న అతి పెద్ద ప్రయత్నంగా దీన్ని చూడాలి. విశాఖను బహుముఖీయంగా అభివృద్ధి చేయాలన్నది కూడా సర్కార్ పెద్దల ఆలోచనగా ఉంది. దానిలో భాగంగా పర్యాటకరంగంలోనూ విశాఖను ముందు నిలబెడతామని భావిస్తున్నారు. దాని కోసం ఈ మధ్యనే జరిగిన సమీక్ష సమావేశంలో విశాఖలో పలు టూరిజం ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
హొటల్ బిజినెస్ లో మోనార్క్ అనదగిన ఓబెరాయ్ సంస్థ విశాఖ జిల్లా భీమిలీలో సెవెన్ స్టార్ సదుపాయాలతో లగ్జరీ రీసార్టులను ఏర్పాటు చేయడం ఈ దిశగా ముందడుగుగా భావించాలి. మొత్తం 350 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించడానికి ఓబెరాయ్ ముందుకు వచ్చింది. దీని వల్ల కూడా కనీసంగా ఆరు వేల మంది దాకా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే మరో ప్రముఖ సంస్థ హయత్ గ్రూప్స్ విశాఖలో అద్భుతమైన స్టార్ హొటల్ ని నిర్మించేందుకు సిద్ధపడుతోంది. ఇవే కాకుండా చాలా టూరిజం ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం జరిగింది. ఇవన్నీ కనుక ఆచరణలోకి వస్తే కచ్చితంగా పది వేల మంది దాకా యువత ఉపాధిని పొందుతారు. మొత్తంగా అరలక్ష పై చిలుకు ఉపాధి అవకాశాలకు విశాఖ వేదికగా అందించాలని ప్రభ్తువం ఆలోచన చేస్తోంది. అదే టైమ్ లో విశాఖ్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేస్తే పాలనా పరమైన యాక్టివిటీ కూడా పెరుగుతుంది. దాంతో విశాఖ కచ్చితంగా అభివృద్ధి చెందుతుందని లెక్కలేస్తున్నారు. విశాఖ విషయంలో జగన్ ఎక్కడా తగ్గకుండా చేస్తున్న కార్యక్రమాలను చూస్తే కనుక విశాఖ జాతకం కంప్లీట్ గా మారిపోతుంది అని చెప్పేయవచ్చు అంటున్నారు.