Begin typing your search above and press return to search.

విచారణలన్నీ రద్దు.. హైకోర్టు సంచలనం

By:  Tupaki Desk   |   25 Jun 2020 4:30 PM GMT
విచారణలన్నీ రద్దు.. హైకోర్టు సంచలనం
X
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, నిమ్మగడ్డల వంటి కీలకమైన వ్యక్తుల పిటీషన్లపై విచారణ జరపాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు తీసుకున్నా నిర్ణయం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

ఆదివారం వరకూ అంటే ఈనెల 28వరకు హైకోర్టుకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఈ మూడు రోజులు ఎలాంటి పిటీషన్లపై విచారణ ఉండబోదని స్పష్టం చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తుల యూనిట్ ను మూసివేస్తున్నట్టు తెలిపారు.

హైకోర్టు విజయవాడ కోర్టుల కార్యకలాపాలు రద్దు చేయడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. విజయవాడలో వందల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉద్యోగులు, సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించబోతున్నారు. ప్రతీ ఉద్యోగి, అన్ని స్థాయిల్లోని సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించబోతున్నారు. అందుకే హైకోర్టు, విజయవాడ కోర్టులను మూసివేస్తున్నారు. వైరస్ పాజిటివ్ గా వస్తే వారిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేసి లేనివారితోనే హైకోర్టు కార్యకలాపాలు నడిపించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.