Begin typing your search above and press return to search.
వారి మాటే నెగ్గింది.. వైసీపీ సర్కార్ కి భారీ షాక్.. ?
By: Tupaki Desk | 13 Dec 2021 9:30 AM GMTఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయింది పాలన మీద ఒక విధంగా పట్టు చిక్కింది. అవగాహన కూడా బాగా వచ్చింది. మరి ఈ రోజుకి కూడా హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అంటే చాలా ఆలోచించాల్సిన విషయమే.
లేటెస్ట్ గా హైకోర్టు మరో విషయంలో సర్కార్ కి షాక్ ఇచ్చేసింది. జగనన్న విద్యా దీవెన పధకం కింద ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ మొత్తాన్ని జగన్ ప్రభుత్వం ఏకంగా తల్లుల ఖాతాలోనే ఇప్పటిదాకా వేస్తూ వచ్చింది. దాని మీద ప్రైవేట్ విద్యా సంస్థలు కోర్టుకు వెళ్లాయి.
తమ ఖాతాలో ఆ సొమ్ము వేయాలని, గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని కూడా పేర్కొన్నాయి. దాని మీద గతంలోనే వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దాంతో రివ్యూ పిటిషన్ని కూడా కోర్టు కొట్టేసింది. ప్రైవేట్ విద్యా సంస్థలకే అనుకూలంగా తీర్పు చెప్పింది.
అంటే ఒక విధంగా అది ప్రైవేట్ విద్యా సంస్థల విజయంగా చూడాలి. గతంలో ఉన్న ఈ విధానాన్ని జగన్ ప్రభుత్వం ఎందుకు కాదంది, తల్లుల ఖాతాలోనే ఎందుకు వేస్తూ వచ్చింది అంటే తల్లులు తమ పిల్లలను చదివించే స్కూళ్ళు, కానీ కళాశాలలు కానీ యాజమాన్యాలను గట్టిగా అడిగేందుకు వీలు ఉంటుందని, తమ చేతుల నుంచి ఫీజుల మొత్తాన్ని చెల్లించడం ద్వారా జవాబుదారీతనం వస్తుందని భావించింది అని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.
అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీలోని విద్యా సంస్థలలో మెజారిటీ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవి, ఇక కొన్ని విద్యా సంస్థలు అయితే విద్యార్ధులు తమ వద్ద లేకపోయినా తప్పుడు లెక్కలు చూపించి ఫీజ్ రీ అంబర్స్ మెంట్ ని తీసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకే విద్యా దీవెన మొత్తాలను తల్లుల ఖాతాలో వేస్తున్నారు అని అంటారు. అంతే కాదు, ఓట్ల రాజకీయం కూడా దీని వెనక ఉంది అని విమర్శించేవారు ఉన్నారు. తల్లుల అకౌంట్ లో నేరుగా సొమ్ము వేయడం ద్వారా ప్రభుత్వం వారి వద్ద మంచి మార్కులు కొట్టేయడానికి ఎన్నికల్లో వారి ఓట్లు తీసుకోవడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకుందని విపక్షాల నుంచి కామెంట్స్ వచ్చాయి.
మొత్తానికి ఏమైతేనేం ప్రభుత్వం పారదర్శకత అంటోంది, జవాబు దారీతనం అని చెబుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా హైకోర్టు తీర్పు తరువాత ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు గెలిచాయి. మరి ప్రభుత్వం ఇక మీదట నేరుగా విద్యా సంస్థల అకౌంట్ లోనే మొత్తం వేయాల్సి ఉంటుంది. అయితే దీని మీద ప్రభుత్వానికి మరో ఆప్షన్ అయితే ఉంది. అది సుప్రీం కోర్టు తలుపులు తట్టడం, మరి అంతదాకా సర్కార్ వెళ్తుందా అంటే చూడాల్సిందే.