Begin typing your search above and press return to search.
జగన్ సర్కారుకు దిమ్మ తిరిగే ప్రశ్నను సంధించిన ఏపీ హైకోర్టు
By: Tupaki Desk | 19 July 2022 5:34 AM GMTఉచితాలు ఎవరికి ఎందుకు ఇవ్వాలి? ఉచితంగా కానీ రాయితీ మీద కానీ ఏదైనా ఇస్తున్నప్పుడు దాని కారణంగా ఒనగూరే ప్రయోజనం ఎంతన్నది కూడా లెక్కే. ఇలాంటి విషయాల్ని మన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవటం కనిపించదు. పన్నులు కట్టేవాడికి.. కష్టపడి సంపాదిస్తూ.. బాధ్యతగా ఉండే వారికి సౌకర్యాల సంగతి పక్కన పెడితే.. పన్నుల పోటుతో షాకుల మీద షాకులు ఇస్తున్న పరిస్థితి ఉందన్న ఫిర్యాదు తరచూ పన్ను చెల్లింపుదారుల నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి బియ్యాన్ని పేదలకు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయటం.
రోగం వచ్చి వైద్యానికి ఆసుపత్రికి వెళితే.. అడిగే దిక్కులేని చోట.. తినేందుకు అవసరమైన బియ్యాన్ని.. అది కూడా ఇంటికే అందమైన ప్యాకింగ్ తో డోర్ డెలివరీ చేసే వైనం మాత్రం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న వైనంపై పలు విమర్శలు ఉన్నాయి. వీటి గురించి పట్టని ప్రభుత్వం తాను అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేయటం మీదనే ఫోకస్ చేస్తోంది.
ఇలాంటి వేళ.. ఏపీ హైకోర్టు సంధించిన ప్రశ్న ఆసక్తికరంగానే కాదు.. ప్రభుత్వానికి షాకిచ్చేలా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల ఏపీలో పాఠశాలల విలీనం పేరుతో విద్యార్థులు మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా చౌక ధరల దుకాణాల స్థానే వాహనాలతో ఇంటికే వస్తువుల్ని డెలివరీ చేస్తున్న పరిస్థితి. ఈ వైరుధ్యాన్ని ఏపీ హైకోర్టు ప్రస్తావించింది.
చౌక ధరల దుకాణాల్ని కాదని వాహనాలతో ఇంటికే సరుకులు ఇస్తామనటంలో హేతుబద్ధత ఏమిటి? వీలు కుదిరినప్పుడు అరగంట సమయం కేటాయించి కిలో మీటరు దూరంలో ఉన్న చౌక ధరల దుకాణంలో సరుకులు తెచ్చుకోలేని స్థితిలో పేదలు ఉన్నారా? అని ప్రశ్నించింది.
రేషన్ డీలర్ కు ఇచ్చే కమీషన్ తో పోలిస్తే వాహనాల ద్వారా డోర్ డెలివరీ కోసం ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్న వైనాన్ని తప్పు పట్టింది. ఇలా ప్రజాధనాన్ని వ్రథా చేసే కన్నా.. ఆ సొమ్ముతో పేద ప్రజలకు మరిన్ని సరుకులు అందించవచ్చు కదా? అని ప్రశ్నించింది. చౌకదుకాణాల నిర్వహణకు నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటింటికి రేషన్ సరఫరాకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది.
వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకుల సరఫరా పథకాన్ని.. అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సంఘం వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యల్ని చేసింది. మరి.. దీనికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి సమాధానాల్ని ఇస్తుందో చూడాలి.