Begin typing your search above and press return to search.
అశ్వినీదత్ పిటీషన్ పై హైకోర్టులో కీలక విచారణ
By: Tupaki Desk | 13 Oct 2020 5:30 PM GMTటాలీవుడ్ సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీలోని జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. గన్నవరం విమానాశ్రయానికి తన భూములు ఇచ్చానని.. అమరావతి రాజధాని తరలిస్తే తన భూముల విలువ పడిపోయి నష్టం వాటిల్లుతోందని.. తనకు నష్టపరిహారం చెల్లించాలని అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించాడు.
నాడు తెలుగుదేశం ప్రభుత్వం గన్నవరంలో తీసుకున్న భూములకు తనకు అమరావతిలో ప్రత్యామ్మాయ భూములు ఇచ్చిందని.. ఇప్పుడు రాజధాని తరలింపు వల్ల తనకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందంటూ అశ్వినీదత్ పిటీషన్లో పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఈ రాజధాని కాంట్రాక్టు నుంచి వైదొలిగి తనకు నష్టం చేసిందని అశ్వినీదత్ దంపతులు హైకోర్టులో పిటీషన్ లో ఆరోపించారు. ఏడాదిగా అమరావతిలో భూములకు లీజు కూడా చెల్లించలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
అశ్వినీదత్ తరుఫున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ మున్సిపల్, సీఆర్డీఏ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.
ఇదే వ్యవహారంలో బీజేపీ నేత, మరో టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కూడా హైకోర్టులో విచారణ సాగుతోంది.