Begin typing your search above and press return to search.

కమిటీలో వారుండకూడదు.. రుషికొండపై హైకోర్టు అదేశం

By:  Tupaki Desk   |   22 Dec 2022 12:43 PM GMT
కమిటీలో వారుండకూడదు.. రుషికొండపై హైకోర్టు అదేశం
X
విశాఖ రుషికొండ మీద అక్రమ తవ్వకాలు జరిగాయా లేదా పర్యావరణానికి విఘాతం జరిగిందా లేదా అన్న దానిమీద కేంద్రం ఆద్వర్యంలో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పూర్తిగా కేంద్ర కమిటీ సభ్యులతోనే కమిటీని తిరిగి ఏర్పాటు చేసి తుది నివేదికను జనవరి 31న నాటికి హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

రుషికొండ తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వం మీద కేంద్రం మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందిఏ. ఒక రోజు గడవకముందే కమిటీలో నుంచి రాష్ట్ర సభ్యులను తొలగించాలని ఆదేశించింది. పూర్తిగా కేంద్రం నుంచే మెంబర్స్ ఉండాలని రుషికొండ మీద నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అక్రమ తవ్వకాలను నిర్ధారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి ఉండేందుకు వీలు లేదని పేర్కొంది.

రుషికొండ అక్రమ తవ్వకాల మీద విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్ర్ష్ణబాబు, జనసేన కార్పోరేటర్ మూర్తీ యాదవ్ హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడమే కాదు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఉన్న సంగతిని గుర్తు చేశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు ఒక కమిటీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆదేశించింది.

అయితే ఆ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఉండడంతో ఈ విషయాన్ని టీడీపీ, జనసేన హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటే కమిటీ నివేదిక సవ్యంగా నిజాయతీగా రాదు అంటూ వారు హై కోర్టు ముందు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇక హైకోర్టు పిటిషనర్ల వాదనలతో అంగీకరించింది. దీని మీద కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

అదే సమయంలో కమిటీ సభ్యుల అనుబంధాన్ని కూడా తప్పుపట్టింది. ఇక నిన్న జరిగిన వాదనలలో హై కోర్టు ఏపీ ప్రభుత్వం కేంద్రం తమ ఆదేశాలను పాటించకుంటే కొత్త కమిటీని తామే వేస్తామని కూడా పేర్కొంది. మొత్తానికి ఇపుడు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసి రుషికొండ అక్రమ త్రవ్వకాల మీద నివేదికను హైకోర్టుకు జనవరి 31లోగా సమర్పించాలి. మరి కేంద్రం కొత్త కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారు. ఎపుడు వారు రుషికొండను సందర్శిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రుషికొండ మీద నిర్మాణాలు కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తల బొప్పి కడుతోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.