Begin typing your search above and press return to search.

'రివర్స్ టెండరింగ్' కు హైకోర్టు అడ్డు

By:  Tupaki Desk   |   22 Aug 2019 7:49 AM GMT
రివర్స్ టెండరింగ్ కు హైకోర్టు అడ్డు
X
జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టులో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తాను తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి గత ప్రభుత్వం ఫైనల్ చేసిన టెండర్ల విషయంలో రివర్స్ టెండర్ల వైనాన్నిజగన్ ప్రభుత్వం వినిపిస్తున్న వాదన తెలిసిందే. దీనికి తగ్గట్లు ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భిన్నమైన ఆదేశాల్ని ఏపీ హైకోర్టు ఇవ్వటం గమనార్హం.

పోలవరం రివర్స్ టెండరింగ్ మీద ముందుకు వెళ్లొద్దంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగకు హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఇదిలా ఉంటే తమ టెండర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నవయుగ నిర్మాన సంస్థ కోర్టుకు దరఖాస్తు చేసుకునే వ్యాజ్యంలో తమ వాదనను వినిపిస్తూ.. ప్రభుత్వం దురుద్దేశంతో జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేసింది. కేవలం రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న నిర్ణయంతోనే ఈ పనికి పూనుకుంది. కొత్తగా ఆహ్వానించిన టెండరు నోటిఫికేషన్ లో 58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. మేం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2021 నంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పింది.

ఇదిలా ఉంటే.. పోలవరంపై రివర్స్ టెండర్ల విషయంలో కేంద్రం కూడా జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తమ మాటను విని పోలవరం టెండర్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పినా ఏపీ సర్కారు వినకపోవటం.. తాము సూచన చేసిన 24 గంటల వ్యవధిలోనే రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయటంపై కేంద్రం గుర్రుగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఏపీ హైకోర్టు సైతం.. రివర్స్ టెండర్ల విషయంలో ముందుకు వెళ్లొద్దన్న మాటను చెప్పటం గమనార్హం.