Begin typing your search above and press return to search.
పరీక్షలపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం.. సర్కారు నిర్ణయేంటి?
By: Tupaki Desk | 30 April 2021 9:30 AM GMTకరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారమే మరో మూడు నెలలు పడుతుందన్న మాట వినిపిస్తోంది. అందులో నిజం ఎంతన్నది కాలమే బదులివ్వాలి. ఇదిలా ఉంటే.. ఏపీలోని జగన్ సర్కారు మాత్రం.. పది.. ఇంటర్ చదివే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పటం.. దీనిపై ఏపీ సీఎం జగన్ సైతం తన వాదనను వినిపించటం తెలిసిందే. పరీక్షలు లేకుండా విద్యార్థులు పాస్ అయితే.. వారి సర్టిఫికేట్ల మీద ‘‘పాస్’’ అన్న మాటే ఉంటుందని.. దీని కారణంగా మంచి కాలేజీల్లో ఆడ్మిషన్లు రావని చెప్పటం తెలిసిందే.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే విపక్షం తప్పుపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఏ మాత్రం సాధ్యం కాదని చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది. ఇలాంటివేళ.. పరీక్షల నిర్వహణ సరికాదంటూ ఒక వ్యాజ్యం ఏపీ హైకోర్టు ముందుకు వెళ్లింది. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పది.. ఇంటర్ పరీక్షలు అంటే.. ముప్ఫై లక్షల మంది విద్యార్థులు.. ఉపాధ్యాయులు భాగస్వామ్యం అవుతారని.. అలాంటప్పుడు కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించింది. అంతేకాదు.. సీబీఎస్ఈ.. ఐసీఎస్ఈ బోర్డులు కూడా పరీక్షల్ని రద్దు చేసింది కదా అని హైకోర్టు గుర్తు చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్న హైకోర్టు.. ఈ అంశంపై మే మూడున ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.
కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. కరోనాతో ఉన్న విద్యార్థుల మానసిక పరిస్థితేంటి? వారు రాయగలుగుతారా? అని ప్రశ్నించటం గమనార్హం. పరీక్షలు రద్దు చేయటం సులువని.. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించటం కష్టమని గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ అంశంపై పునరాలోచన చేయాలని హైకోర్టు పేర్కొంది. మరీ అంశంపై జగన్ సర్కారు ఏ తీరులో రియాక్టు అవుతుందో చూడాలి.