Begin typing your search above and press return to search.

‘మూడు రాజధానులు’ తీర్పు రిజర్వ్ లో పెట్టిన ఏపీ హైకోర్టు

By:  Tupaki Desk   |   12 Oct 2020 4:20 PM GMT
‘మూడు రాజధానులు’ తీర్పు రిజర్వ్ లో పెట్టిన ఏపీ హైకోర్టు
X
మూడు రాజధానులపై తన తీర్పును ఏపీ హైకోర్టు రిజుర్వులో పెట్టింది. అక్టోబర్ 6 నుంచి ‘మూడు రాజధానులకు’ వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు విచారిస్తోంది. సోమవారం ఈ పిటిషన్ల విచారణ అంతా ముగిసింది. దీంతో ఏపీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తీర్పును నవంబర్ 2కి వాయిదా వేసింది.

మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వైజాగ్, తిరుపతి, కాకినాడ నగరాల్లో సిఎం గెస్ట్ హౌస్‌లు నిర్మిస్తున్నారా అని హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. గెస్ట్ హౌస్‌లు లేదా తాత్కాలిక క్యాంప్ కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నందుకు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపింది. ఈ నిర్మాణాలు శాశ్వతమా? మారుమూల ప్రదేశాలలో జరుగుతున్నాయా అనేది సందేహమని తేల్చింది. వైజాగ్ గెస్ట్ హౌస్ గురించి దాని నిర్మాణ ప్రాంతం, గదులు వంటి వివరాలను కూడా ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించడం లేదని ” హైకోర్టును ప్రశ్నించింది.

దీనికి ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రతిసారీ సిఎం ఏపీలోని ఒక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, వసతి కోసం ప్రభుత్వం భారీ మొత్తాలను చెల్లిస్తోందని విన్నవించారు.. ఈ అనవసరమైన ఖర్చును నివారించడానికి, ప్రభుత్వం ఈ అతిథి గృహాల కోసం ప్రణాళిక వేసిందని.. అందుకే నిర్మిస్తోందని వివరించారు.

దీనికి సమాధానమిచ్చిన హైకోర్టు ఈ ప్రాంత జనాభాకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని.. దీనికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఈ మూడు రాజధానుల కేసును వీకెండ్ లో కూడా విచారణ జరుపుతామని తెలిపారు. ప్రస్తుతానికి 3 రాజధానులపై తీర్పును రిజర్వ్ చేసింది.