Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్ : అమరావతి పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
By: Tupaki Desk | 3 March 2022 6:31 AM GMTమూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలల్లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది.
ఒప్పందం ప్రకారం.. 6 నెలల్లోనే మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని హైకోర్టుకు తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భూములకు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని.. రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించవద్దని స్పష్టం చేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలని సూచించింది. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని పేర్కొంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని.. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించకూడదని ఆదేశించింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2020 జనవరి 20న ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై ప్రవేశపెట్టిన బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. అమరావతికి సంబంధించి చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సీఆర్డీఏను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది.
అయితే ఏపీ శాసనమండలిలో మాత్రం ఈ బిల్లును టీడీపీ అడ్డుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి ఆపుచేసింది. 2020 జూన్ 17న రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు.
ఇక ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు-2020 లకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 2020 జులై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెలరోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులకు ఆమోదం పంపింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు
ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దీనిపై హైకోర్టుకు అమరావతి రైతులు, టీడీపీ, మేధావులు వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.