Begin typing your search above and press return to search.
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
By: Tupaki Desk | 13 Oct 2022 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించడంపై గత విచారణలోనే ప్రభుత్వంపై హైకోర్టు మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును మరోమారు హైకోర్టు విచారించింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో వైఎస్సార్సీపీ నేతలపై దాఖలైన అనేక కేసులను ఉపసంహరిస్తూ జీవోలు జారీ చేసింది. వీటిలో కొన్ని తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుపై కూడా దాఖలైన వివిధ కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ మేరకు పలు జీవోలు జారీ చేసింది.
దీన్ని తప్పుబడుతూ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. జగన్ ప్రభుత్వం రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఉపసంహరిస్తూ జీవోలు ఇచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో దీనిపై గత విచారణ సందర్భంగా హైకోర్టు మండిపడింది. తమ అనుమతి లేకుండా కేసులు ఎలా ఉపసంహరిస్తారని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరుపున ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో తప్పని పరిస్థితులలో రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఎత్తేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మొత్తం జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేసింది. ప్రభుత్వం కేసులు కొనసాగించడంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం మూసివేసింది.
వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడుదల రజని, జక్కంపూడి రాజా, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై క్రిమినల్ కేసుల ఉపసంహరణపై గతంలో సుమోటోగా కూడా హైకోర్టు కేసు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.
తమ ప్రభుత్వం రాగానే కేసుల్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి పెంచి సాధించుకున్న వారంతా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో షాకవుతున్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందేనని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం తీవ్ర మల్లగుల్లాలు పడింది. చివరికి తమ నిర్ణయాన్ని తాజాగా హైకోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేసుల ఉపసంహరణ వ్యవహారం కొలిక్కి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.