Begin typing your search above and press return to search.
శ్రీలక్ష్మికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు ..: పిటిషన్ కొట్టివేత..
By: Tupaki Desk | 20 Feb 2022 6:35 AM GMTఏపీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టు షాకిచ్చింది. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోర్టులో వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. శ్రీలక్ష్మి ఉమ్మడి ఏపీ పరిశ్రమల కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె బంధువు రాకేశ్ బాబు ఆస్తులను కూడబెట్టినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపింది.
దీంతో ఈ కేసుకు సంబంధించి కింది కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. అంతకుముందున్న లీజుల వ్యవహారాల్లోకి వెళ్లరాదన్న శ్రీలక్ష్మి వాదనను ఏకీభవించలేమని తెలిపింది.
ఓఎంసీ గనుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, అలాగే తనకు నష్టపరిహారం ఇవ్వాలని 2015లో హైకోర్టులో పిటిషన్ వేశారు శ్రీలక్ష్మి. సుదీర్ఘ కాలం ఈ కేసును విచారించిన కోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చారు.
అయితే మైనింగ్ లీజులు కేంద్రం పరిధిలోనివని, ఇంతుల శ్రీలక్ష్మి పాత్ర లేదని ఆమె తరుపున న్యాయవాది అన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి శ్రీలక్ష్మి ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. అయితే తిరస్కరించిన దరఖాస్తుదారులకు నోటీసులిచ్చి వారి అభ్యర్థనను విన్నాక నిర్ణయం తీసుకోవాలని, ఒక వేళ తిరస్కరిస్తే కారణాలను ఉత్తర్వుల్లో పేర్కొనాలని తెలిపారు.
అయితే ఈ వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ ను తిరస్కరించారు. కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపారు. ఓఎంసీపీఎల్, బీఐఓపీఎల్ తో పాటు ఇతర కంపెనీల సరిహద్దు వివాదం, అక్రమ మైనింగ్ మాత్రమే విచారించాననన్న శ్రీలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చారు.
ఇక అక్రమ లీజులతోనే అక్రమ మైనింగ్ నడుస్తుందని, దీనిపై దర్యాప్తు చేసే అధికారి సీబీఐకి ఉందని అన్నారు. అయితే మాయా వతి కేసును శ్రీలక్ష్మి కేసుతో పోల్చలేమని తెలిపారు. శ్రీలక్ష్మి తాను చట్ట విరుద్ధ పనులు చేయలేదన్న వాదనను పరిగణలోకి తీసుకోమని న్యాయమూర్తి వివరించారు.
గతంలోనూ శ్రీలక్ష్మికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ విచారణను నిలిపివేయాలన్నపిటిషన్ ను గత నవంబర్లో కొట్టివేసింది.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లోని ఓబులాపురం మైనింగ్ కేసు తేలేవరకు ఓఎంసీ కేసులో తనపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ నూ కోట్టివేసింది. ఇలా ప్రతీ కోర్టులో శ్రీ లక్ష్మికి వ్యతిరేక తీర్పులు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఏపీలో పరిశ్రమల కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మికి గత జూన్ లో ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి ఏపీ కేడర్ లో చేరారు. క్యాట్ ఆదేశాల మేరకు ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది.
దీంతో ఏపీ ప్రభుత్వం ఆమెకు పురపాలక శాఖ కార్యదర్శిగా పోస్టు ఇచ్చారు. వాస్తవానికి ఆమెను రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని కేంద్రం తెలంగాణకే కేటాయించింది. అయితే 2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న సమయంలో రిలీవ్ కాలేదు. అయితే 2019లో జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆమె ఏపీ ప్రభుత్వానికి మారారు.