Begin typing your search above and press return to search.
ఊపందుకున్న మూడు రాజధానుల కేసు విచారణ
By: Tupaki Desk | 10 Dec 2020 1:01 PM GMTఅమరావతి హైకోర్టులో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై విచారణ ఊపందుకుంది. అమరావతి ప్లేసులో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే జగన్ ప్రతిపాదనలు వెలుగు చూశాయో వెంటనే వ్యతిరేకంగా అనేకమంది కేసులు వేశారు. ఎనిమిది మాసాల క్రితమే దీనిపై అనేకమంది కేసులు వేసినా కరోనా వైరస్ తదితరాల కారణంగా విచారణ నెమ్మదిగా సాగింది. అలాంటిది ఇపుడు ఒక్కసారిగా వేగం పుంజుకుంది.
ఇన్ని రోజులు అమరావతికి అనుకూలంగా పిటీషన్లు వేసిన వాళ్ళ తరపు లాయర్ల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం తాజాగా ప్రభుత్వం తరపున వాదనలు కూడా వింటోంది. ప్రభుత్వం తరపున సుప్రింకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదిస్తు జగన్ ప్రతిపాదించిన కార్యనిర్వాహక, న్యాయ, శాసన రాజాధానుల ఏర్పాటు వల్ల ఎంతో ప్రయోజనం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మధ్యలో ఆపద్దంటు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం హయాంలో అమరావతిని రాజధానిగా వ్యాపారవేత్తలు, రాజకీయనేతలే నిర్ణయించారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అప్పట్లో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటి నివేదిక ఇవ్వకముందే చంద్రబాబునాయుడు వ్యాపార+రాజకీయవేత్తలతో నియమించిన కమిటి అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ నిర్ణయమే అన్న విషయాన్ని దవే గుర్తుచేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మూడు అఫిడవిట్లలో కూడా చెప్పిందన్నారు. రాజధానుల ఏర్పాటు విషయంలో కోర్టులు జోక్యం చేసుకుంటే రాష్ట్రాల హక్కులను లాక్కోవటమే అవుతుందని గట్టిగా చెప్పారు. గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య ఎట్టి పరిస్ధితుల్లోను రాజధాని ఏర్పాటు చేయవద్దని శివరామకృష్ణన్ కమిటి స్పష్టంగా చెప్పినా అప్పటి పాలకులు తమ స్వార్ధంతోనే అమరావతిని రాజధానిగా చేశారంటూ దవే ఆక్షేపించారు.