Begin typing your search above and press return to search.

కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు..కేసులో కొత్త ట్విస్ట్

By:  Tupaki Desk   |   15 Dec 2020 11:30 PM GMT
కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు..కేసులో కొత్త ట్విస్ట్
X
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కొందరు టీడీపీ నేతలు పిటిషన్లతో కోర్టు మెట్లెక్కుతున్నారన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు, కొందరు ప్రజలు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై వారు చేసిస ఆరోపణలు పెను దుమారం రేపాయి. దీంతో, ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో వారు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై కేసులు నమోదు చేయాలని కోర్టు కొద్ది నెలల క్రితం ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై కేసుల నమోదు ప్రక్రియ అంత సులువు కాదన్న వాదన తాజాగా వినిపిస్తోంది. ఆ వ్యాఖ్యలు చేసిన వారిలో చాలామంది విదేశాల్లలో ఉండడంతో వారిని స్వదేశానికి రప్పించడం కష్టతరమైన పని అని కోర్టు గుర్తించింది. దీంతో, ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐకి హైకోర్టు మరో నాలుగు నెలల గడువు ఇచ్చింది.

న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచాలని కొద్ది నెలల క్రితం సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అయితే, 2 నెలలైనా సీఐడీ కేసులు నమోదు చేయలేదు. దీంతోపాటు, ఎవరినీ అదుపులో తీసుకోలేదు. ఈ క్రమంలో సీఐడీపై ఆగ్రహించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. అయితే, సీబీఐ కూడా ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడంతో ఈ వ్యవహారం పురోగతిపై హైకోర్టు విచారణ జరిపింది. దీంతో, సీఐడీ మాదిరిగానే సీబీఐ విచారణలోనూ పురోగతి ఏమీ లేదని తేలిందట. న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యలు చేసిన వారిలో చాలామంది విదేశాల్లో ఉన్నారని సీబీఐ గుర్తించిందట. దీంతో, విదేశాల్లో ఉండి వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు ఎలా పెట్టాలన్న డైలమా ఏర్పడిందట. కేసులు పెట్టి విచారణకు వారిని ఎలా పిలిపించాలన్న విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయట. ఆ వ్యాఖ్యలు చేసిన వారి సర్వీస్ ప్రొవైడర్లకు సీబీఐ నోటీసులు జారీ చేసిందట. నేరగాళ్లను విదేశాల నుంచి రప్పించే అవకాశాలున్నాయి. అయితే, ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిని రప్పించడం అనేది కొత్త వ్యవహారం.దీంతో, ఈ విచారణకు మరో 4 నెలల గడువు కావాలని సీబీఐ కోరడంతోనే కోర్టు అంగీకరించింది.