Begin typing your search above and press return to search.

తీర్పులు, జడ్జీల దూషణ కేసు సీబీఐకి..ఏపీ హైకోర్టు సంచలనం

By:  Tupaki Desk   |   12 Oct 2020 4:00 PM GMT
తీర్పులు, జడ్జీల దూషణ కేసు సీబీఐకి..ఏపీ హైకోర్టు సంచలనం
X
ఏపీ హైకోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు తీర్పులు, జడ్జీలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా కొందరు పెట్టిన పోస్టులతోపాటు వైసీపీ నేతలు చేసిన కామెంట్ల కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా జగన్ సర్కార్ పై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీతో విచారణ చేయించింది. ఈ సీఐడీ విచారణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

గతంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 19మంది పేర్లతో న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులు పెట్టారని ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో 9మందిపై మాత్రమే కేసు నమోదు చేయడంపై హైకోర్టు నిలదీసింది. మిగిలిన వారికి ప్రభుత్వం రక్షణగా ఉంటుందా? అంటూ ఘాటుగా స్పందించింది.

ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ కేసును సీఐడీ నుంచి సీబీఐ అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఐడీ కన్నా సీబీఐ తరహా సంస్థకు సాంకేతిక పరిజ్ఞానం.. తగిన వనరులు.. విభాగాలు ఉంటుందని.. అవసరమైతే ఇంటర్ పోల్ ను సంప్రదించడానికి వీలుంటుందని హైకోర్టు తెలిపింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న ఏజీ స్పందిస్తూ ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎనిమిది వారాల్లో హైకోర్టుకు పూర్తిగా అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీబీఐకి ఏపీ ప్రభుత్వం కూడా సహకరించాలని హైకోర్టు సూచించింది.