Begin typing your search above and press return to search.
మీ ప్రభుత్వ పవర్ ను ప్రజలు ఎప్పుడు తీయాలి: ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 7 Jan 2023 6:50 AM GMTఏపీలో జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఇప్పటికే వివిధ అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను సైతం వివిధ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టుకు పిలిపించింది. న్యాయమూర్తులను దూషిస్తూ వైసీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపైన సైతం హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరోమారు జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కేసును విచారించిన హైకోర్టు రూ.40 లక్షలు బకాయిలు కట్టలేదని గ్రానైట్ పరిశ్రమకు కరెంటు నిలిపివేశారని.. మరి కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని.. మరి ప్రభుత్వ పవర్ ను ప్రజలు ఎప్పుడు తీయాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందుల్లేవని శాసనసభలో మంత్రులు ఘనంగా ప్రకటిస్తున్నారని హైకోర్టు గుర్తు చేసింది. మరి ఆర్థిక ఇబ్బందులు లేకపోతే కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనదార్లకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీసింది. బకాయిల కోసం కాంట్రాక్టర్లు కోర్టు మెట్లు ఎక్కాల్సిన దుస్థితి ఎందుకొస్తుందని ప్రశ్నించింది.
బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లను దొంగల్లా తయారుచేస్తోందని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధుల్ని నవరత్నాలకు మళ్లించే అధికారం ఎక్కడుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా నిలదీసింది. కార్పొరేషన్‌కు కేటాయించిన సొమ్ములో ఒక్క రూపాయి కూడా మళ్లించరాదని గతంలో తీర్పిచ్చామని గుర్తు చేసింది. తమ ఆదేశాలు మీరితే కోర్టుధిక్కరణే అవుతుందని స్పష్టం చేసింది.
గ్రానైట్ పరిశ్రమ కార్మికులు రోడ్డునపడకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలన్న తమ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు ఇంధన శాఖ ఉన్నతాధికారులను హైకోర్టు విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎస్‌సీఎస్) కె.విజయానంద్, సీపీడీసీఎల్ సీఎండీ జనార్దన్‌రెడ్డి, సంబంధిత ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ సయద్ అబ్దుల్ కరీం తదితరులను హైకోర్టు నిలదీసింది. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలు విషయంలో ఉన్నతాధికారులే ఇలా ఉంటే కింద స్థాయి సిబ్బంది ఇంకా దారుణంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టింది.
తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోగా.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రకాశం జిల్లా చీమకుర్తి సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సయ్యద్ అబ్దుల్ కరీం తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆయనపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి, నోటీసులు పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని విజయానంద్, జనార్దన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. అబ్దుల్ కరీం తప్ప మిగిలిన అధికారులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
రూ.40 లక్షలకు పైగా బకాయిలు చెల్లించలేదనే కారణంతో ప్రకాశం జిల్లాకు చెందిన వీఎల్ గణపతి గ్రానైట్స్ పరిశ్రమకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో గణపతి గ్రానైట్స్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయమూర్తి.. పరిశ్రమపై పలువురు ఆధారపడి జీవిస్తుంటారని, వారి జీవనాధారం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిసెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే. అయితే జనవరి 3న జరిగిన విచారణలో గ్రానైట్ పరిశ్రమ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విద్యుత్‌ను పునరుద్ధరించలేదన్నారు. అంతేకాకుండా అధికారులు న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జనవరి 6న హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.