Begin typing your search above and press return to search.
ఎంపీ రఘురామకు హైకోర్టు మొట్టికాయలు
By: Tupaki Desk | 7 May 2022 3:17 AM GMTరాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయటం ద్వారా.. తాను టార్గెట్ చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామ కృష్ణరాజుకు తాజాగా ఏపీ హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు చీవాట్లు పెట్టింది. కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ప్రజలు ఆయన్ను పార్లమెంటుకు పంపారని.. ఆయన లేవనెత్తాలనుకున్న అంశాల్నిపార్లమెంటులోఎత్తాలని పేర్కొన్నారు. సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించకుండా న్యాయస్థానానికి రావటం ఏమిటని ప్రశ్నించారు.
ఇదంతా ఎందుకు జరిగిందంటే.. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ మహిమగా చెప్పాలి. ఏపీ ప్రభుత్వం బ్యాంకులు.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చటమే కాదు.. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు నడిపించవని.. ఆర్థిక అంశాల్లో జోక్యం చేసుకోమని చెప్పింది. ఈ పిటిషన్ పై విచారణను తీరిగ్గా జరుపుతామంటూ తదుపరి వాయిదానుజూన్ 15కు వాయిదా వేసింది.
ఏపీలోని జగన్ సర్కారు విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల రెండు చట్టాల్ని తీసుకురావటానని ఎంపీ రఘురామ సవాలు చేశారు. బ్యాంకులు.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాస్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్థి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఆర్థికపరమైన అంశాలు.. నిర్వాహణ తదితరాలననీ కూడా పూర్తిగా ప్రభుత్వ విచక్షణకు సంబంధించినవని స్పష్టం చేస్తూ..రుణాలు పొందకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందని.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ‘ఆర్థిక పరిస్థితికి సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్),, అకౌంటెంట్ జనరల్ (ఏజీ).. చూసుకుంటారని పేర్కొంది. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రభుత్వాలను కోర్టులు నడపవని.. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.