Begin typing your search above and press return to search.
రిపోర్టు చెప్పిన నిజం.. దేశంలో నెంబర్ వన్ స్టేట్ ఏపీ
By: Tupaki Desk | 10 Dec 2021 4:41 AM GMTఒకటి తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సమస్యలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అత్యద్భుత మెజార్టీతో.. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నరేళ్లు పూర్తైన సంగతి తెలిసిందే. ఏ ముహుర్తంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో కానీ.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రోజు నుంచి ఇప్పటివరకు కుదురుగా.. ప్రశాంతంగా ఒక పది రోజుల పాటు ఆయన ఉన్నది లేదు. నిత్యం ఏదో ఒక సవాలు.. సమస్య.. ప్రభుత్వం మీద విమర్శ.. ఆరోపణ.. ఏదో ఒకటి చోటు చేసుకోవటం తెలిసిందే.
తాను నమ్మిన సంక్షేమాన్ని అమలు చేసేందుకు ఆయన చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంసలతో పాటు.. విమర్శల్ని భారీగా ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి. గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాల కోసం చేసిన ఖర్చుపై వస్తున్న విమర్శలు అన్ని ఇన్ని కావు.
ఇదిలా ఉంటే.. ఆయన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల తీరును తాజాగా విడుదలైన ఒక రిపోర్టు ప్రశంచింటమే కాదు.. దేశంలో సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రంగా ఏపీని గుర్తించి.. ప్రశంసల వర్షం కురిపించింది.
పీఆర్ఎస్ ఇండియా ఆర్గనైజేషన్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ స్టేట్స్ పైనాన్సెస్’ రిపోర్టు లో బడ్జెట్ కేటయింపుల్లో సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన నిలిచినట్లుగా పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీల సంక్షేమానికి ఏపీ అత్యధిక కేటాయింపులు జరిపినట్లుగా పేర్కొన్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపుల్ని అధ్యయనం చేసిన ఈ సంస్థ.. తన తాజా రిపోర్టులో జగన్ సర్కారు తీరును మెచ్చుకుంది.
ఈ వార్షిక బడ్జెట్ లో ఏకంగా 13.1 శాతం నిధుల్నిఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీల సంక్షేమానికి కేటాయించినట్లుగా నివేదిక పేర్కొన్నారు. ఏపీ తర్వాతి స్థానంలో తెలంగాణ 7.9 శాతం.. మూడో స్థానంలో మహారాష్ట్ర 4.8 శాతం ఖర్చు చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కేవలం 3 శాతానికి లోపే ఈ వర్గాలకు నిధుల కేటాయింపు ఉన్నట్లు పేర్కొన్నారు. మొదటి స్థానంలో ఏపీ నిలిస్తే.. చివరి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఏపీ సర్కారు 13.1 శాతం నిధుల్ని ప్రతిపాదిత బడ్జెట్ లో కేటాయింపులు జరిపితే.. హిమాచల్ ప్రదేశ్ కేవలం 0.2 శాతం నిధుల్ని మాత్రమే కేటాయించటం గమనార్హం.