Begin typing your search above and press return to search.

మహారాష్ట్రను మించి.. సెక్స్ వర్కర్లకు అడ్డాగా ఏపీ

By:  Tupaki Desk   |   22 Dec 2022 1:30 AM GMT
మహారాష్ట్రను మించి.. సెక్స్ వర్కర్లకు అడ్డాగా ఏపీ
X
మహారాష్ట్ర.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. ముంబై, నాగపూర్, ఫూణే, భీవండి సహా ఎన్నో నగరాలు ఉండడంతో ఇక్కడికి వలసవచ్చే వారితోపాటే సెక్స్ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇన్నాళ్లు మహారాష్ట్రనే దేశంలో తొలి స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడా తొలి స్థానాన్ని మన ఏపీ లాగేసుకుంది. దేశంలోనే సెక్స్ వర్కర్లకు నిలయంగా మారింది. ఈ లెక్కలు తాజాగా కేంద్రం చెప్పినవి కావడంతో అందరూ అవాక్కవుతున్న పరిస్థితి నెలకొంది.

స్థానిక సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది. స్థానిక సెక్స్ వర్కర్లు , వలస వచ్చిన సెక్స్ వర్కర్లను కలిపి లెక్కిస్తే, ఏపీ దేశంలోనే అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉందని చాలా ఎన్జీవో సంస్థలు తేల్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్‌ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసింది.

ఈ నివేదిక ప్రకారం స్థానిక సెక్స్ వర్కర్లు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షల మంది ఉన్నారు. కర్ణాటకలో 1.16 లక్షల మంది, తెలంగాణలో లక్ష మంది ఈ పని ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మహారాష్ట్రను విడిచిపెట్టి 6.6 లక్షల మంది వలస సెక్స్ వర్కర్లు దేశంలో నివసిస్తుంటే.. గుజరాత్ (2.3 లక్షలు), ఢిల్లీ (2.3 లక్షలు) తర్వాతి వరుసలో ఉన్నాయి.

ఏపీలో సెక్స్ వర్కర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. చాలా కాలంగా అక్రమ మానవ రాకపోకలకు ఏపీ అడ్డుగా నిలుస్తోంది.

దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న సెక్స్ వర్కర్లు ఎదురవుతున్నారు. ఈ లెక్కలు ప్రభుత్వ గణాంకాల ఆధారంగా ఉంటాయి. లెక్కలు చూపని వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారని సామాజిక కార్యకర్త ఎన్ రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం ఓ ఎన్జీవోను నడుపుతున్నాడు.

మహారాష్ట్ర, గుజరాత్‌లతో పోలిస్తే ఏపీలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నప్పటికీ ఆమోదయోగ్యంగా లేదని.. మహారాష్ట్రలోనే ఎక్కువ ఉండొచ్చని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.