Begin typing your search above and press return to search.
ఎలా తప్పించుకుందాం: న్యాయవాదులతో బాబు చర్చ?
By: Tupaki Desk | 14 Feb 2020 9:00 AM GMTరూ. 2 వేల కోట్ల నగదు బదలాయింపు అంశం అధికారులు బహిర్గతం కావడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో దాన్నుంచి బయటపడేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కేసు, కుంభకోణమైనా వాటి నుంచి తప్పించుకోవడంలో దిట్టగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఈ కుంభకోణం నుంచి బయటపడేలా మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా గురువారం అమరావతి నుంచి తన పుత్రరత్నం లోకేశ్ తో కలిసి హుటాహుటిన హైదరాబాద్ పయనమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీటి నుంచి బయటపడే మార్గాలపై చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసింది. రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము లెక్కలు బయటపడ్డాయని అధికారులు గురువారం మీడియాకు వెల్లడించడంతో అదే రోజు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నట్లు, ఆ వెంటనే నుంచి న్యాయవాదులు, తన ఆడిటర్లతో చర్చలు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల్లో తన మాజీ పీఎస్ నుంచి అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోవడంతో తన పేరు ఎక్కడ బయటకు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, బోగస్ సబ్ కాంట్రాక్టర్లను రాకెట్‌గా ఏర్పాటు చేసి.. భారీ నగదు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లూవాలియా గురువారం మీడియాకు విడుదల చేశారు. అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపడం (ఓవర్ ఇన్‌వాయిసింగ్), బోగస్ బిల్లులు సృష్టించడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలను సేకరించామని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
ఐటీ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో పలు కీలక డైరీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరుగుతున్నా వాటిపై చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. తనిఖీల సమయంలో శ్రీనివాస్ తన అవినీతి వివరాలు చెప్పేశాడేమోనని బాబు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా శనివారం హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా చంద్రబాబు రెండురోజుల ముందుగానే గురువారం వచ్చేశారని, ఐటీ రాడార్‌కు చిక్కిన ఈ కుంభకోణంపై తప్పించుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.