Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పై యోగి గెలుపు ప్ర‌భావం ఎంతంటుందంటే ?

By:  Tupaki Desk   |   11 March 2022 2:30 AM GMT
జ‌గ‌న్ పై యోగి గెలుపు ప్ర‌భావం ఎంతంటుందంటే ?
X
సుస్థిర ప్ర‌భుత్వాలు మాత్రమే సుస్థిరం అనుకునే ఆలోచ‌న‌లు ఇస్తాయ‌ని అంటారు.ఆ విధంగా ఆంధ్రాలో సుస్థిర ప్ర‌భుత్వం ఉన్నా కూడా జ‌గ‌న్ ఇంకా కొన్ని త‌ప్పిదాలు చేస్తూనే ఉన్నారు అన్న‌ది బీజేపీ వాద‌న.అయితే యోగి లాంటి నేత‌లను చూసి కొన్ని దిద్దుకోవ‌చ్చు. ఒక్క జ‌గ‌న్ అనే కాదు చంద్ర‌బాబు కూడా కొన్ని నేర్చుకోవ‌చ్చు. అతి సామాన్య రీతిలో క‌నిపించే నేత‌ల‌లో యోగి ఒక‌రు.అయిన‌ప్ప‌టికీ క‌ష్టం మీద పైకి వ‌చ్చారు.

రాష్ట్రంలో సున్నిత భావోద్వేగాల‌ను అడ్డం పెట్టుకుని ఆడుకునే అరాచ‌క శ‌క్తుల‌ను అడ్డుకున్నారు.ఈ విష‌యంలో జ‌గ‌న్ నేర్చుకోవాల్సి ఉంది. మ‌త సంబంధ వివాదాలు ఇక్క‌డ కూడా న‌డిచిన‌ప్ప‌టికీ వాటి ప్ర‌భావం నుంచి అంత వేగంగా వైసీపీ ఎందుక‌నో కోలుకోలేక‌పోయింది. ఇదీ మొద‌టి విష‌యం.

ఇక రెండో విష‌యం ఏంటంటే..దేశ రాజ‌కీయాల్లో తానొక ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా యోగి ఎదిగారు.అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి జ‌గ‌న్ కూడా జాతీయ‌స్థాయి నేత‌గా ఎదిగేందుకు కృషి చేయాలి.అంటే బీజేపీ చెప్పే వాటిపై సానుకూల‌త,వ్య‌తిరేక‌త రెండూ కూడా వినిపింప‌జేయాలి. ఆర్థిక మూలాలు ఓ రాష్ట్ర ప్ర‌గ‌తిని నిర్దేశిస్తాయి.అందుకే జ‌గ‌న్ కూడా యూపీ క‌న్నా బెట‌ర్ గా ఏపీని త‌యారు చేయాలంటే ముందుగా కొన్ని ఉచిత ప‌థ‌కాలు ర‌ద్దు చేయాలి. బాలికా విద్య‌ను ప్రోత్స‌హించి, ర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

యోగి ప్ర‌భుత్వంలో నోటి దురుసు మంత్రులు లేరు. ఏం మాట్లాడినా అది వివాద‌మే అయినా కూడాయోగి మాత్రమే తెర‌పై ఉంటారు. కానీ ఇక్క‌డ బొత్స మొద‌లుకుని నాని వ‌ర‌కూ అంతా మాట్లాడుతూనే ఉంటారు. ఇది కూడా యోగి ద‌గ్గ‌ర జ‌గ‌న్ నేర్చుకోవాలి.

మ‌ళ్లీ సీఎం క‌ల జ‌గ‌న్ కు నెర‌వేరాలంటే యోగి లా అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వాలి. సంక్షేమ రంగం పై ప్రేమ వ‌దులుకోవాలి. కేంద్రంతో పోరాడి నిధులు తేస్తేనే ఇవాళ ఆయ‌న హీరో అయ్యేది. కానీ ఆయ‌న ఆ విధంగా ప‌నిచేయాలంటే ఇంకొంత శ్ర‌ద్ధ వహించాల‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.