Begin typing your search above and press return to search.

అమరావతిపై సెలెక్ట్ కమిటీని ఎంపిక చేసిన ఛైర్మన్

By:  Tupaki Desk   |   6 Feb 2020 11:38 AM GMT
అమరావతిపై సెలెక్ట్ కమిటీని ఎంపిక చేసిన ఛైర్మన్
X
ఆ రెండింటికి సెలెక్ట్ కమిటీలు.. కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఏపీ మండలి ఛైర్మన్. ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం.. ఏపీ మండలిలో వీగిపోవటం.. దీనిపై సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి ఛైర్మన్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో మండలిని రద్దు చేయాలన్న ఆలోచనను ఏపీ సర్కారు చేస్తోంది. ఇందుకు తగ్గట్లు పావులు కదుపుతోంది కూడా.

ఇదిలా ఉంటే.. రాజధాని అంశంపై సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ మండలి ఛైర్మన్ షరీఫ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ గా బొత్స సత్యానారాయణను నియమించారు. సభ్యులుగా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి..అర్జునుడు.. రవిచంద్ర.. శ్రీనివాసుల్ని ఎంపిక చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ ను.. పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు.. బీజేపీకి చెందిన సోము వీర్రాజును నియమించారు.

మరోవైపు పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులు కాగా.. సభ్యులుగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. సభ్యులుగా టీడీపీ నుంచి లోకేశ.. అశోక్ బాబు.. తిప్పేస్వామి.. సంధ్యారాణి.. పీడీఎఫ్ కు చెందిన లక్ష్మణరావు.. బీజేపీ చెందిన మాధవ్.. వేణుగోపాల్ రెడ్డిలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధంగా మండలి ఛైర్మన్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. కమిటీల్లో తాము పాలు పంచుకోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. తనకున్న విచక్షణాధికారాల్ని ఎవరూ ప్రశ్నించలేరంటూ మండలి ఛైర్మన్ చేసిన వ్యాఖ్య చేయటం గమనార్హం. మరీ.. లొల్లి ఎక్కడికి వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.